Russia Ceasefire : యుక్రెయిన్‌లో యుద్ధానికి రష్యా బ్రేక్.. మాకు మనసుంది.. అందుకే కాల్పుల విరమణ..!

యుక్రెయిన్‌లో ఏకధాటిగా దాడులకు పాల్పడిన రష్యా ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్‌లో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్టు ప్రకటించింది.

Russia Ceasefire : యుక్రెయిన్‌లో యుద్ధానికి రష్యా బ్రేక్.. మాకు మనసుంది.. అందుకే కాల్పుల విరమణ..!

Russia Declares Ceasefire In Ukraine To Open Humanitarian Corridors For Civilians (2)

Russia Ceasefire :  వారానికిపైగా యుక్రెయిన్‌లో ఏకధాటిగా దాడులకు పాల్పడిన రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచదేశాల ఒత్తిడితో యుక్రెయిన్‌లో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించింది. యక్రెయిన్‌లో ఉదయం 11.30 నుంచి కాల్పులు విరమించినట్టు రష్యా ప్రకటించింది. మానవతాధృక్పథంతో కాల్పుల విరమణిస్తున్నట్టు రష్యా వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎంతగా వారించిన ఏమాత్రం వెనక్కి తగ్గని అధ్యక్షుడు పుతిన్ మానవతాధృక్పథంతో వెనక్కి తగ్గాడు. యుద్ధం చేయడమే కాదు.. సానుభూతి చూపడం కూడా తెలుసునని రష్యా ఈ చర్యతో ప్రకటించుకుంది. తమకు కూడా మనసు ఉందని పుతిన్ ఈ కీలక నిర్ణయంతో నిరూపించుకున్నారు.

Russia Ceasefire :  ఐదున్నర గంటల పాటు యుద్ధానికి తాత్కాలిక బ్రేక్..
విదేశీయులను యుక్రెయిన్ నుంచి తరలించేందుకు ఐదున్నర గంటలపాటు యుద్ధానికి తాత్కాలిక విరామాన్ని ప్రకటించినట్టు రష్యా ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  యుద్ధక్షేత్రంలో సామాన్యులు దేశం దాటేందుకు వీలుగా కాల్పులను విరమణకు అంగీకరించినట్టు తెలిపింది. యుద్ధాన్ని ప్రారంభించిన 10వ రోజు కాల్పుల విరమణను ప్రకటించింది. యుద్ధంలో సామాన్యులు బలికాకుండా ఉండేందుకు కాల్పుల విరమణను ప్రకటించినట్టు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది.

యుద్ధంలో పదో రోజు ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. యుక్రెయిన్ ప్రజలు, విదేశీయులు సురక్షితంగా దేశం దాటేందుకు వీలుగా కాల్పుల విరమణ ప్రకటించినట్టు తెలిపింది. దాదాపు ఐదున్నర గంటల పాటు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉండనుందని రష్యా ప్రకటించింది. యుక్రెయిన్ రెండు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. మరియుపోల్, వోల్నోవఖా ప్రాంతాల్లో కాల్పులను విరమించినట్టు ప్రకటించింది. భారతీయులు ఎక్కువగా లేని ప్రాంతాల్లోనే కాల్పులను విరమించింది. సుమిలో కాల్పుల విరమణను భారత్ కోరింది. రష్యా ప్రకటించిన నగరాలతో భారతీయులకు ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో సివిల్ కారిడర్ల ఏర్పాటుకు రెండో విడత చర్చలో ఒప్పందం కుదిరింది. వోల్నోవఖా ప్రాంతంలో మరో సివిల్ కారిడార్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

Russia Declares Ceasefire In Ukraine To Open Humanitarian Corridors For Civilians (1)

Russia Declares Ceasefire In Ukraine To Open Humanitarian Corridors For Civilians

రష్యా ప్రకటనతో యుక్రెయిన్‌తో పాటు విదేశీయులకు భారీ ఊరట కలిగినట్టే చెప్పవచ్చు. యుద్ధం సమయంలో దేశ సరిహద్దులను దాటడంలో భారతీయులు సహా ఇతర విదేశీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ స్వదేశానికి వెళ్లాలనుకునేవారంతా యుక్రెయిన్ సరిహద్దుల్లో నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు వీలు పడింది. కాల్పుల విరమణ సమయం దాటిన అనంతరం రష్యా మళ్లీ కాల్పులను ప్రారంభించే అవకాశం ఉంది.

ఇప్పటికే.. యుద్ధాన్ని ఆపండి. లేదంటే.. యుక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ అమలు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటో సభ్య దేశాలను కోరారు. నో ఫ్లైజోన్ అమలు చేయాలనే ఆయన ప్రతిపాదనను నాటో తిరస్కరించింది. అలా చేస్తే.. ఐరోపాలో పెను యుద్ధానికి దారితీస్తుందన్న నాటో హెచ్చరిస్తోంది. యుక్రెయిన్ గగనతలంలో నో ఫ్లై జోన్ ఏర్పాటుకు తిరస్కరించినుందుకు ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)పై అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు.

నాటా నిర్ణయంతో యుక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా మరింత బాంబు దాడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అవుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 24న రష్యా భూమి, సముద్రం, వాయుమార్గం ద్వారా యుక్రెయిన్ పై ఏకకాలంలో దాడులకు తెగబడింది. ఈ క్రమంలోనే యుక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ గతంలోనే నాటోను అభ్యర్థించారు. అయితే రష్యా వైమానిక దాడుల నుంచి యుక్రెయిన్‌ రక్షించడానికి నాటో సాయం చేసేందుకు తిరస్కరించింది. తూర్పు ఐరోపాను యుద్ధంలోకి లాగడానికి నాటో కూటమి ఇష్టపడటం లేదు.

నాటో కూటమి నిర్ణయంతో యుక్రెయిన్ అధ్యక్షుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాల మద్దతు ఉండి కూడా సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరూ తమకు సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఒంటరిగానే రష్యాతో పోరాడుతోంది యుక్రెయిన్. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది..

రష్యా దాడులతో అణు కేంద్రాలకు ముప్పు :
మరోవైపు.. యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్లు, ప్రధాన నగరాలే లక్ష్యంగా రష్యా బలగాలు దూసుకొస్తున్నాయి. అణు కేంద్రాలు ఉన్న ప్రాంతంలో దాడులు చేయొద్దని రష్యాకు సూచించినప్పటికీ ఆ దేశ బలగాలు ఆ ప్రాంతాలనే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. రష్యా దాడుల్లో అణు విద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ ఘటన పునరావృతం అవుతుందనే ఆందోళన ఎక్కువుతోంది.

వాస్తవానికి ఈ అణు రియాకర్లు ఎన్నో ఏళ్ల క్రితమే ఇక్కడ నిర్మించారు. యుక్రెయిన్‌ కూడా వాటి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రష్యా వైమానిక దాడులు చేయడాన్ని యుక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఉంది.  ఈ నేపథ్యలో రష్యా కాల్పల విరమణ ప్రకటించడంతో యుక్రెయిన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

 

Read Also : Ukraine no fly Zone : యుక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ ఏర్పాటుకు నాటో తిరస్కరణ.. జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం..!