KGF 2 : విజయ్‌ని సొంత రాష్ట్రంలో దెబ్బ కొట్టిన యశ్..

తమిళనాడు లో కలెక్షన్ల విషయంలో రెండు సినిమాలు కొద్ది వ్యత్యాసంతో పోటీ పడుతూ వస్తుండగా గతంలోనే చెన్నైలో 'కేజిఎఫ్ 2' బీస్ట్ కలెక్షన్లని దాటేయగా తాజాగా తమిళనాడు మొత్తం.........

KGF 2 : విజయ్‌ని సొంత రాష్ట్రంలో దెబ్బ కొట్టిన యశ్..

Beast Vs Kgf

Beast :  ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్, కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజిఎఫ్ 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 13న బీస్ట్ రిలీజ్ అవ్వగా, ఏప్రిల్ 14న కేజిఎఫ్ 2 రిలీజ్ అయింది. రెండు సినిమాలని భారీగానే ప్రమోషన్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ ఉన్న కేజిఎఫ్ 2ని చూసి బీస్ట్ సినిమాని మరింత ఎక్కువ ప్రమోట్ చేశారు. ఎప్పుడూ లేనిది కేజిఎఫ్ 2 సినిమా దెబ్బకి విజయ్ కూడా ఈ సారి ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొన్నారు.

 

ముందు నుంచి తమిళనాడులో బీస్ట్ డామినేషన్ ఉన్నా దేశం మొత్తం మాత్రం ‘కేజిఎఫ్ 2’ డామినేషన్ ఉంటుంది అని అంతా భావించారు. బీస్ట్ మొదటి రోజే భారీ నెగిటివ్ టాక్ ని తెచ్చుకోగా కేజిఎఫ్ 2 మాత్రం భారీ విజయం సాధించి కలెక్షన్లని కొల్లగొడుతుంది. మొదటి నుంచి తమిళనాడులో బీస్ట్ డామినేషన్ ఉంటుంది అనుకున్నారు అంతా. అయితే తమిళనాడులో కూడా బీస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో వీకెండ్ కి తమిళనాడులో బీస్ట్ సినిమాని బీట్ చేసేసింది కేజిఎఫ్ 2.

KGF 2 : డియర్ బ్రదర్ అంటూ యశ్, నీల్‌పై చరణ్ స్పెషల్ ట్వీట్

ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో చాలా థియేటర్స్ లో కేజిఎఫ్ కోసం బీస్ట్ ని తీసి పక్కనపెట్టేశారు. బాలీవుడ్ లో అయితే బీస్ట్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు కూడా. ఇప్పుడు విజయ్ సొంత రాష్ట్రంలో కూడా బీస్ట్ ని దెబ్బ కొట్టింది కేజిఎఫ్. మొదటి నుంచి కూడా తమిళనాడులో బీస్ట్ కి గట్టి పోటీ ఇస్తుంది కేజిఎఫ్ 2. తమిళనాడు లో కలెక్షన్ల విషయంలో రెండు సినిమాలు కొద్ది వ్యత్యాసంతో పోటీ పడుతూ వస్తుండగా గతంలోనే చెన్నైలో ‘కేజిఎఫ్ 2’ బీస్ట్ కలెక్షన్లని దాటేయగా తాజాగా తమిళనాడు మొత్తం మీద బీస్ట్ సినిమాని బీట్ చేసింది కేజిఎఫ్ 2.

KGF : ప్రశాంత్ నీల్ మన తెలుగువాడే.. ఈ రాజకీయ నాయకుడికి బంధువే.. మీకు తెలుసా??

తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ‘కేజిఎఫ్ 2’ సినిమా 8 రోజుల్లో 64.04 కోట్లు వసూలు చేయగా బీస్ట్ సినిమా మాత్రం 9 రోజుల్లో 61.17 కోట్లు వసూలు చేసింది. దీంతో ‘కేజిఎఫ్ 2’ సినిమా బీస్ట్ సినిమాని దెబ్బ కొట్టింది. వసూళ్ల పరంగా బీస్ట్ సినిమాని బీట్ చేసి తమిళనాడులో కూడా ‘కేజిఎఫ్ 2’ డామినేషన్ చూపిస్తుంది. ఇప్పుడు తమిళనాడుతో సహా ఇండియా మొత్తం సలాం రాకీ భాయ్ అంటుంది.