Kinnerasani Trailer : ‘ఇది కథ కాదు.. ప్రతి అక్షరం నిజం’..

‘కిన్నెరసాని’ అనే మిస్టరీ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులముందుకు రాబోతున్న చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్..

Kinnerasani Trailer : ‘ఇది కథ కాదు.. ప్రతి అక్షరం నిజం’..

Kinnerasani Trailer

Updated On : December 30, 2021 / 11:48 AM IST

Kinnerasani Trailer: ‘విజేత’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కొంత గ్యాప్ తర్వాత ‘కిన్నెరసాని’ అనే డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ & శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల మీద రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. రమణ తేజ డైరెక్ట్ చేస్తున్నాడు. షీతల్, కషిష్ ఖాన్ ఫీమేల్ లీడ్స్. పాపులర్ కన్నడ నటుడు రవీంద్ర అజయ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. గురువారం ‘కిన్నెరసాని’ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Bhola Shankar : కీర్తి సురేష్ భర్తగా!

వేద అనే ఓ అమ్మాయి తన తండ్రి గురించి వెతికే క్రమంలో ఈ కథ జరుగుతుంది. అసలు ‘కిన్నెరసాని’ అనే పుస్తకానికి, జరుగుతున్న కథకి సంబంధం ఏంటనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఆర్టిస్టులంతా పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేశారని అర్థమవుతోంది.

Nivetha Thomas : ‘జై బాలయ్య’ పాటకు నివేదా థామస్ డ్యాన్స్! వీడియో వైరల్

ట్రైలర్ చివర్లో.. రవీంద్ర అజయ్ ‘మీకో రహస్యం చెప్పనా.. ఇది కథ కాదు.. ప్రతి అక్షరం నిజం’.. అనే డైలాగ్ చెప్పడంతో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దినేష్ కె బాబు విజువల్స్, మహతి స్వర సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. త్వరలో మిస్టరీ థ్రిల్లర్ ‘కిన్నెరసాని’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.