Tarakaratna Wife : తారకరత్న భార్య కూడా సినీ పరిశ్రమే.. తారక్, అలేఖ్య లవ్ స్టోరీ తెలుసా??

తారకరత్నకు తెలిసిన స్నేహితుల ద్వారా అలేఖ్యరెడ్డి పరిచయమైంది. ఆమె కూడా సినీ పరిశ్రమలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేది. అప్పటికే పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ డిపార్ట్మెంట్ లో...............

Tarakaratna Wife : తారకరత్న భార్య కూడా సినీ పరిశ్రమే.. తారక్, అలేఖ్య లవ్ స్టోరీ తెలుసా??

know about Tarakaratna Wife alekhya reddy and their love story

Updated On : February 20, 2023 / 11:30 AM IST

Tarakaratna Wife :  తెలుగు సినీపరిశ్రమలో గత కొద్దికాలంగా వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తూ విషాదాన్ని మిగిల్చారు. తాజాగా నటుడు నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ పరిశ్రమతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.

ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహన కృష్ణ కుమారుడిగా తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తారకరత్నకు తెలిసిన స్నేహితుల ద్వారా అలేఖ్యరెడ్డి పరిచయమైంది. ఆమె కూడా సినీ పరిశ్రమలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేది. అప్పటికే పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ డిపార్ట్మెంట్ లో అలేఖ్య పనిచేసింది. కొన్నాళ్ల పాటు సాగిన వీరి స్నేహం ప్రేమగా మారింది. కానీ వీరి ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో 2012లో అలేఖ్యరెడ్డిని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు తారకరత్న. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ జంటని ఇరు కుటుంబాలు చేరదీశాయి.

Taraka Ratna : నందమూరి తార‌క‌ర‌త్న కన్నుమూత.. ప్రముఖుల నివాళులు.. లైవ్ అప్డేట్స్

వీరు ప్రేమలో ఉన్నప్పుడే తారకరత్న సినిమా నందీశ్వరుడుకి అలేఖ్యరెడ్డి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా పనిచేసింది. ఈ జంటకి 2013లో నిష్కా అనే పాప జన్మించింది. పాప పుట్టిన తర్వాత తారకరత్న భార్య సినిమాలకు దూరంగా ఉంది. ఇలా తారకరత్న ఇంత త్వరగా దూరమవడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది.