Koratala Shiva : ఆచార్య కోసం.. 20 ఎకరాల్లో సృష్టించిన ధర్మస్థలి..

ఆచార్య సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ‘ధర్మస్థలి’ ఎక్కడ ఉంది అని వెతకడం ప్రారంభిస్తారు. కథ ఎక్కువగా ధర్మం అనే................

Koratala Shiva : ఆచార్య కోసం.. 20 ఎకరాల్లో సృష్టించిన ధర్మస్థలి..

Dharmasthali

 

Acharya :  చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. సినిమా రిలీజ్ కి ఇంకో అయిదు రోజులే ఉండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని షేర్ చేస్తున్నారు. కొరటాల శివ ప్రత్యేకంగా ఈ సినిమా గురించి చెప్పిన వీడియోల్ని పోస్ట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

 

ఆచార్య సినిమాని ధర్మస్థలి అనే ఒక ఊరిలో తీసారని తెలిసిందే. అయితే ఈ ధర్మస్థలి అనే ఊరిని నిర్మించడం విశేషం. దీనిపై డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడారు. కొరటాల శివ మాట్లాడుతూ.. ”ఆచార్య సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ‘ధర్మస్థలి’ ఎక్కడ ఉంది అని వెతకడం ప్రారంభిస్తారు. కథ ఎక్కువగా ధర్మం అనే కాన్సెప్ట్‌ చుట్టే ఉంటుంది కాబట్టి ఆ టెంపుల్‌ టౌన్‌కి ‘ధర్మస్థలి’ అనే పేరు పెడితే బాగుంటుందని అనిపించి పెట్టాం. మా అందరికీ ఆ పేరు బాగా నచ్చింది. ధర్మస్థలి ఎపిసోడ్‌ షూట్‌కి ఒక అందమైన టెంపుల్‌ టౌన్‌ కావాలి. అందుకోసం చాలా చోట్ల వెతికాం. కొన్ని ప్రదేశాలు మాకు నచ్చినా అక్కడ షూటింగ్ కి సాధ్యం కాదు అనిపించింది.”

Bollywood : అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ని బీట్ చేసిన ‘కేజిఎఫ్ 2’

”అందుకే చివరికి ‘ధర్మస్థలి’ని సృష్టించాలని అనుకున్నాం. నిర్మాతలు కూడా ఓకే అన్నారు. దాంతో మా ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ ఎన్నో ప్రాంతాలకు వెళ్లి పరిశోధన చేసి ఈ ధర్మస్థలి సెట్ ని నిర్మించారు. ఒక అందమైన ప్రదేశంగా దీన్ని తీర్చి దిద్దారు. 20 ఎకరాల్లో కోట్లు వెచ్చించి బిగ్గెస్ట్‌ సెట్‌ ని నిర్మించారు. ఒక ఊరినే సెట్ వేసి నిర్మించాము. మీకు సినిమాలో చూస్తే ఎక్కడా సెట్ లాగా అనిపించదు, నిజమైన ఊరిలాగే ఉంటుంది” అని తెలిపారు.