Krithi Shetty: బాలీవుడ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన బేబమ్మ.. నిజమేనా?
అందాల భామ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అమ్మడు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఆ తరువాత వరుసగా పలు సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.

Krithi Shetty Rejected Bollywood Offer
Krithi Shetty: అందాల భామ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అమ్మడు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఆ తరువాత వరుసగా పలు సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.
Krithi Shetty: సొగసు చూడతరమా అంటూ చీరలో సోయగాలు ఒలికిస్తున్న కృతిశెట్టి..
అయితే ఇటీవల ఆమె కెరీర్ గ్రాఫ్ కిందకు వెళ్తూ ఉంది. ఇప్పటికే వరుసగా మూడు ఫ్లాప్ మూవీలను మూటగట్టుకోవడంతో కృతికి తెలుగునాట ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. వాస్తవానికి అమ్మడికి తెలుగులో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదట. దీంతో ఆమె ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోందట. కాగా, అమ్మడికి వచ్చిన ఓ భారీ ఆఫర్‌ను ఆమె రిజెక్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
Krithi Shetty : మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన బేబమ్మ.. పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది..
ఓ బాలీవుడ్ సినిమాలో నటించాల్సిందిగా కృతి వద్దకు వచ్చారట అక్కడి దర్శకనిర్మాతలు. అయితే ఈ ఆఫర్‌ను ఆమె రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టిందని, అందుకే బాలీవుడ్ ఆఫర్‌కు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మళ్లీ సక్సెస్ ఎప్పుడు దక్కుతుందో చూడాలి.