Krithi Shetty : మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన బేబమ్మ.. పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది..

మలయాళం స్టార్ హీరో టొవినో థామస్‌తో జతకట్టనుంది కృతి. టొవినో థామస్ హీరోగా 'అజయంతే రందం మోషణం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని............

Krithi Shetty : మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన బేబమ్మ.. పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది..

Krithi Shetty entry in Malayalam Industry

Updated On : October 12, 2022 / 8:49 AM IST

Krithi Shetty :  ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. దీంతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి కృతి చేరిపోయి వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఇటీవల రెండు పరాజయాలు ఎదురైనా కూడా బేబమ్మ స్పీడ్ తగ్గలేదు. టాలీవుడ్ తో పాటు తమిళ్ లో కూడా సినిమాలు ఓకే చేసుకుంటుంది. తాజాగా కృతిశెట్టి మలయాళంలో ఎంట్రీ ఇవ్వనుంది.

మలయాళం స్టార్ హీరో టొవినో థామస్‌తో జతకట్టనుంది కృతి. టొవినో థామస్ హీరోగా ‘అజయంతే రందం మోషణం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని త్రీడీలో కూడా రూపొందిస్తున్నారు. అంతేకాక పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో కృతిశెట్టితోపాటు, ఐశ్వర్యరాజేష్‌, సురభి లక్ష్మిలు కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం మంగళవారం జరిగింది.

Pushpa : మొన్న బన్నీ, నేడు అనసూయ.. న్యూయార్క్ మేయర్ తో కలిసి తగ్గేదేలే అంటున్న అనసూయ..

ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కృతి శెట్టి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మలయాళంలో డెబ్యూ ఇస్తున్నాను. ఇలాంటి స్టార్స్ అందరితో కలిసి వర్క్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అని పోస్ట్ చేసింది.