Pushpa : మొన్న బన్నీ, నేడు అనసూయ.. న్యూయార్క్ మేయర్ తో కలిసి తగ్గేదేలే అంటున్న అనసూయ..

తాజాగా మరోసారి న్యూయార్క్ మేయర్ తగ్గేదేలే అంటూ హడావిడి చేశారు. ఇటీవల దసరా సందర్భంగా అక్కడి తెలుగు సంఘం వాళ్ళు న్యూయార్క్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేయగా దానికి అనసూయ, మంగ్లీ అతిధులుగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి..............

Pushpa : మొన్న బన్నీ, నేడు అనసూయ.. న్యూయార్క్ మేయర్ తో కలిసి తగ్గేదేలే అంటున్న అనసూయ..

Anasuya with newyork mayor pushpa mannerism video goes viral

Pushpa : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి, ఆ సినిమాలో పాటలకి, డైలాగ్స్ కి క్రేజ్ బాగా వచ్చింది. దేశ విదేశాల్లో సైతం ఈ సినిమాలోని పాటలు, తగ్గేదేలే అంటూ బన్నీ ఇచ్చిన మేనరిజం బాగా పాపులర్ అయ్యాయి. ఇటీవల న్యూయార్క్ లో భారతదేశ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్నాడు బన్నీ. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ న్యూయార్క్ మేయర్ ని కలవగా వారు అల్లు అర్జున్ ని, పుష్ప సినిమాని విపరీతంగా పొగిడేశారు. బన్నీతో కలిసి న్యూయార్క్ మేయర్, ఇతరులు ‘తగ్గేదే లే’ అంటూ స్టిల్స్ ఇవ్వగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

తాజాగా మరోసారి న్యూయార్క్ మేయర్ తగ్గేదేలే అంటూ హడావిడి చేశారు. ఇటీవల దసరా సందర్భంగా అక్కడి తెలుగు సంఘం వాళ్ళు న్యూయార్క్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేయగా దానికి అనసూయ, మంగ్లీ అతిధులుగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా హాజరయ్యాడు. పలువురు అమెరికా ప్రతినిధులు బతుకమ్మ, దసరా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ మేయర్ ఆఫీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేశారు.

BiggBoss 6 Day 37 : మళ్లీ రెచ్చిపోయిన గీతూ.. కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుకున్న బిగ్‌బాస్‌..

అయితే ఇదే ఈవెంట్లో యాంకర్ అనసూయతో కలిసి న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, మరో ప్రతినిధి తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజంని చేసి చూపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పుష్ప చిత్ర యూనిట్ ఈ వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”భారతీయ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీకి ప్రత్యేక కృతజ్ఞతలు” అని పోస్ట్ చేశారు.