BiggBoss 6 Day 37 : మళ్లీ రెచ్చిపోయిన గీతూ.. కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుకున్న బిగ్‌బాస్‌..

సోమవారం నాడు నామినేషన్ల ప్రక్రియతో బిగ్‌బాస్‌ రచ్చ రచ్చగా సాగింది. ఇక మంగళవారం హౌస్ లోని కంటెస్టెంట్స్ లోనే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చర్చ జరిగింది. హౌస్ లో ఉన్న వాళ్ళే అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. అలాగే ఈ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లు మొదలుపెట్టాడు..............

BiggBoss 6 Day 37 : మళ్లీ రెచ్చిపోయిన గీతూ.. కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుకున్న బిగ్‌బాస్‌..

BiggBoss 6 Day 37 emotional captaincy Tasks

BiggBoss 6 Day 37 :  సోమవారం నాడు నామినేషన్ల ప్రక్రియతో బిగ్‌బాస్‌ రచ్చ రచ్చగా సాగింది. ఇక మంగళవారం హౌస్ లోని కంటెస్టెంట్స్ లోనే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చర్చ జరిగింది. హౌస్ లో ఉన్న వాళ్ళే అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. అలాగే ఈ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లు మొదలుపెట్టాడు. ఈ సారి కొంచెం ఎమోషనల్ గా ఉండే టాస్క్ ని తీసుకున్నాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్ లో పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు.

మొదట కెప్టెన్సీ టాస్క్ గా ఛార్జింగ్ గేమ్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. గార్డెన్ ఏరియాలో ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో బ్యాటరీ ఇచ్చి వాళ్ళు చేసే పనులతో 100 శాతం ఛార్జింగ్ చేయాలన్నాడు. అలాగే వాళ్ళకి కొన్ని ఎమోషనల్ టాస్కులు ఇచ్చి అవి చేస్తే ఛార్జింగ్ కొంత శాతం తగ్గుతుంది అని కూడా చెప్పాడు. వీటిలో కచ్చితంగా ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే అని తెలిపాడు.

ఈ ఎమోషనల్ టాస్కుల్లో కచ్చితంగా అందరూ ఎమోషనల్ అవుతారు అని బిగ్‌బాస్‌ చెప్తుండగా అందరు బిగ్‌బాస్‌ చెప్పింది వింటుంటే గీతూ మాత్రం నేను ఎమోషనల్ అవ్వను, కావాలంటే నన్ను ఏడిపించడానికి ట్రై చెయ్ బిగ్‌బాస్‌ అని ఛాలెంజ్ లు చేసింది. మరోసారి గీతూ ఓవర్ యాక్షన్ చేసి హడావిడి చేసింది.

BiggBoss 6 Day 36 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారో తెలుసా?? హౌస్ లో కొత్త జంటలు..

ఈ టాస్కులో మొదటగా శ్రీహాన్‌ని కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిచి మూడు ఆప్షన్లు ఇచ్చారు బిగ్‌బాస్‌. ఒకటి నాన్నతో వీడియో కాల్‌ మాట్లాడటం అందుకు 35శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, సిరితో ఆడియో కాల్ చేసినందుకు 30శాతం, ఇంటి ఫుడ్‌ తీనేందుకు 15 శాతం ఛార్జింగ్‌ తగ్గిపోతుందని తెలిపారు. వాళ్ళతో మాట్లాడాలనుకున్నా గేమ్ లో గెలవాలని ఛార్జింగ్ ఎక్కువగా తగ్గకూడదు అని ఇంటి ఫుడ్ తినడానికి ఓకే చెప్పాడు. కానీ నాన్న, సిరితో మాట్లాడే అవకాశం కోల్పోయినందుకు బాధపడ్డాడు.

ఆ తర్వాత సుదీపకి ఆమె భర్తతో మాట్లాడే అవకాశం కావాలంటే 30శాతం, భర్త పంపిన టీషర్ట్ పొందాలంటే 40శాతం, అమ్మ చేసిన చికెన్ కర్రీ పొందాలంటే 35శాతం బ్యాటరీ ఖర్చు అవుతుందని చెప్పడంతో సుదీప భర్తతో ఆడియో కాల్‌ మాట్లాడింది. ఆ తర్వాత ఆదిరెడ్డికి భార్య, కూతురుతో వీడియో కాల్‌ మాట్లాడేందుకు 40శాతం, భార్యతో ఆడియో కాల్‌కి30 శాతం, కూతురు పంపిన టీషర్ట్ ధరించాలంటే 35శాతం బ్యాటరీ తగ్గుతుందని చెప్పడంతో ఆదిరెడ్డి మాత్రం ఎమోషనల్ అయి తన కూతురు, భార్యతో మాట్లాడేందుకు ఓకే చెప్పాడు. వారిద్దరితో వీడియో కాల్ మాట్లాడి 40 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ని వదులుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య, కూతురుతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు ఆదిరెడ్డి. ఇలా మిగిలిన కంటెస్టెంట్స్ కి కూడా కొన్ని ఎమోషనల్ అషన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో కొంతమంది ఏడ్చేశారు కూడా. కొంతమంది ఛార్జింగ్ అయితే సగానికి పైగా తగ్గిపోయింది కూడా. ఎమోషనల్ గా సాగుతున్న ఈ కెప్టెన్సీ టాస్కుల్లో ఎవరు గెలిచి కెప్టెన్ అవుతారో చూడాలి.