BiggBoss 6 Day 36 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారో తెలుసా?? హౌస్ లో కొత్త జంటలు..

నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఈ సారి కంటెస్టెంట్స్ వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖంపై ఫోమ్ పూసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పి చేయాలన్నారు..............

BiggBoss 6 Day 36 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారో తెలుసా?? హౌస్ లో కొత్త జంటలు..

BiggBoss 6 Day 36 Nomination Process

BiggBoss 6 Day 36 :  బిగ్‌బాస్‌ లో హైప్ తీసుకురావడానికి ఉన్న జంటలు పనిచేయట్లేదేమో కొత్త జంటలని కలుపుతున్నారు. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో చంటి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సోమవారం ఎపిసోడ్ లో ఎప్పటిలాగే నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ కంటే ముందు హౌస్ లో కొత్త జంటల గురించి మాట్లాడుకున్నారు. మొన్నటిదాకా శ్రీసత్య-అర్జున్ అని చూపించి ఇప్పుడేమో శ్రీహన్-శ్రీసత్య అని చూపిస్తున్నారు. అలాగే సూర్య-ఆరోహిలని మొన్నటిదాకా చూపించారు. ఆరోహి ఎలిమినేటి అవ్వడంతో ఇప్పుడు సూర్య-ఇనయా అని చూపిస్తున్నారు. రేవంత్ కి కూడా వాసంతిని లింక్ చేసి మాట్లాడుకున్నారు కంటెస్టెంట్స్.

ఇక నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఈ సారి కంటెస్టెంట్స్ వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖంపై ఫోమ్ పూసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పి చేయాలన్నారు.

మొదట కెప్టెన్ గా ఉన్న రేవంత్.. బాలాదిత్య, సుదీపలను నామినేట్‌ చేశాడు.
ఆదిరెడ్డి.. మరీనాను, కీర్తిని నామినేట్ చేశాడు. దీంతో మరీనా, ఆదిరెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రేవంత్ కూడా దూరడంతో ఆదిరెడ్డి, రేవంత్ కొట్టుకునేదాకా వెళ్లారు.
కీర్తి.. గీతూ, శ్రీసత్యలను నామినేట్ చేసింది.
రోహిత్‌.. శ్రీహాన్‌, ఆదిని నామినేట్ చేశాడు.
సుదీప.. ఆది, కీర్తిలను నామినేట్ చేసింది.
వాసంతి.. గీతూ, ఆదిలను నామినేట్ చేసింది.
శ్రీహాన్‌.. గీతూ, రాజ్‌లను నామినేట్ చేశాడు.
బాలాదిత్య కూడా గీతూ, రాజ్‌లను నామినేట్ చేశాడు.
అర్జున్‌.. కీర్తిని, ఆదిని నామినేట్ చేశాడు.
సూర్య.. గీతూ, ఆదిని నామినేట్ చేశాడు.
ఫైమా.. సుదీప, బాలాదిత్యను నామినేట్ చేసింది.
ఇనయా.. శ్రీహాన్‌, కీర్తిలని నామినేట్ చేసింది.
రాజ్‌.. గీతూ, బాలాదిత్యను నామినేట్ చేశాడు.
మరీనా.. కీర్తి, ఆదిరెడ్డిని నామినేట్‌ చేసింది.
గీతూ.. రాజ్, కీర్తిలని నామినేట్ చేసింది. ఈ సమయంలో గీతూ చెలరేగిపోయి రాజ్ తో గొడవ పెట్టుకుంది.
శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డిలని నామినేట్ చేసింది.

BiggBoss 6 Day 35 : దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఎంట్రీ.. బిగ్‌‌బాస్‌ నుంచి చలాకి చంటి అవుట్..

మొత్తానికి ఈ వారం కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్‌, రాజ్‌, శ్రీసత్య, మరీనాలు నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వీకెండ్ కి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.