Vehicle pending challans : లాస్ట్ డే.. నేటితో ముగియనున్న పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ గడువు..

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు ఇచ్చిన బంపర్ ఆఫర్ గడువు నేటితో ముగియనుంది. ఇటీవల వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం డిస్కౌట్ ఆఫర్ ప్రకటించింది. ఈ గడువు ...

Vehicle pending challans : లాస్ట్ డే.. నేటితో ముగియనున్న పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ గడువు..

Traffic Challan

Vehicle pending challans : తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు ఇచ్చిన బంపర్ ఆఫర్ గడువు నేటితో ముగియనుంది. ఇటీవల వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం డిస్కౌట్ ఆఫర్ ప్రకటించింది. ఈ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియనుంది. వాహనదారులకు వివిధ రూపాల్లో విధించిన చలాన్లు భారీగా పెండింగ్ లో ఉండటంతో డిస్కౌట్ ఆఫర్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో తక్కువ మొత్తంలో చెల్లించే అవకాశం రావడంతో తమ వాహనాలపై ఉన్న చలాన్లను వాహనదారులు క్లియర్ చేసుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్ లు క్లియర్ అయినట్లు పోలీస్ శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 60శాతం మోటారు వాహన యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

Challan Pending : వాహనదారులకు వార్నింగ్.. ఒక్క చలానా ఉన్నా బండి సీజ్

వాహనదారులు పెండింగ్ లో ఉన్న చలాన్లు చెల్లించండానికి ప్రభుత్వం భారీగా డిస్కౌట్ ప్రకటించిన విషయం విధితమే. టీవీలర్, త్రీ వీలర్ కు 75శాతం, ఆర్టీసీ డ్రైవర్స్ 70శాతం, లైట్ మోటార్ వెహికిల్స్, హెవీ మోటర్ వెహికల్స్ కు 50శాతం, తోపుడు బండ్ల వ్యాపారులపై 80శాతం, నో మాస్క్ కేసులపై 90శాతం మాఫీ ప్రకటిస్తూ ప్రభుత్వం వెల్లడించింది. మార్చి1 నుండి మార్చి 31 వరకు అవకాశం కల్పిస్తూ ఈ ఆఫర్ ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్చి 31 వరకు అనుకున్న టార్గెట్ పూర్తికాకపోవటంతో ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనుంది.

Challan Pending : వాహనదారులకు వార్నింగ్.. ఒక్క చలానా ఉన్నా బండి సీజ్

అయితే ఈ దఫా కూడా ప్రభుత్వం గడువు పెంచుతుందని అందరూ భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన గడువు కంటే అదనంగా మరో పదిహేను రోజులు గడువు పెంచిన నేపథ్యంలో ఇక్కడితో డిస్కౌంట్ ఆఫర్ కు స్వస్తిపలికేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాయత్రం వరకు డిస్కౌంట్ ఆఫర్ లో చలాన్లు చెల్లించక పోతే శనివారం నుంచి చలాన్ల మోత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.