Lata Mangeshkar : ఒడిశా బీచ్‌లో లతా సైకత శిల్పం.. శిల్పి సుదర్శన్‌ ఘన నివాళులు

దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ మృతికి సంతాపం తెలియచేస్తూ ఆమె సైకతశిల్పాన్ని రూపొందించాడు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్‌ పట్నాయక్. ఒడిశాలోని పూరి బీచ్‌లో లతా మంగేష్కర్ సైకతశిల్పాన్ని.....

Lata Mangeshkar :  ఒడిశా బీచ్‌లో లతా సైకత శిల్పం.. శిల్పి సుదర్శన్‌ ఘన నివాళులు

Lata Mangeshkar Sand Art (1)

Updated On : February 7, 2022 / 1:40 PM IST

Lata Mangeshkar :   గాన కోకిల లతా మంగేష్కర్‌ నిన్న ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణం భారత సినీ సంగీత పరిశ్రమకి తీరని లోటు. చాలా మంది ప్రముఖులు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు. అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో నివాళులు అర్పిస్తున్నారు.

Lata Mangeshkar : లతా మంగేష్కర్ ఆస్తులు ఎవరికి??

దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ మృతికి సంతాపం తెలియచేస్తూ ఆమె సైకతశిల్పాన్ని రూపొందించాడు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్‌ పట్నాయక్. ఒడిశాలోని పూరి బీచ్‌లో లతా మంగేష్కర్ సైకతశిల్పాన్ని చిత్రీకరించి… మేరీ ఆవాజ్‌ హీ పెహచాన్‌ హై అనే క్యాప్షన్‌ని సీడీపై రాశాడు. ట్రిబ్యూట్ టు ఇండియన్‌ నైటేంగిల్ లతామంగేష్కర్‌ అంటూ కూడా రాశాడు. సుదర్శన్‌ పట్నాయక్‌ ఇలా సైతక శిల్పాన్ని చిత్రీకరించి లెడంజరీ సింగర్‌కి ఇదే నా నివాళి అంటూ తెలిపారు. లతా మంగేష్కర్‌ అస్వస్థతకు గురైనప్పుడు కూడా సైకత శిల్పాన్ని చెక్కారు సుదర్శన్‌ పట్నాయక్.