Leopard attack pet dog: గేటు దూకి వచ్చి పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత

మూసివేసి ఉన్న గేటును సైతం అమాంతం దూకి, ఇంటిలో ఉన్న పెంపుడు కుక్కను.. చిరుత పులి నోటకరుచుకు వెళ్లిన దృశ్యం భయబ్రాంతులకు గురిచేస్తుంది.

Leopard attack pet dog: గేటు దూకి వచ్చి పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత

Leopard Catch Dog

Leopard attack pet dog: కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంత సమీపంలో నివసించే వారికి, వెన్నులో ఒణుకు పుట్టించే ఘటన ఇది. మూసివేసి ఉన్న గేటును సైతం అమాంతంగా దూకి, ఇంటిలో ఉన్న పెంపుడు కుక్కను.. చిరుత పులి నోటకరుచుకు వెళ్లిన దృశ్యం భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు, కుక్క పరిస్థితిని తలుచుకుంటూ అయ్యో పాపం అంటున్నారు.

మధ్యప్రదేశ్ లోని చ్చత్తర్పూర్ అనే గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇక్కడి కొండ ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అటవీ ప్రాంతం నుంచి అపుడప్పుడు వన్యమృగాలు గ్రామాల్లోకి వస్తుంటాయి. వన్యమృగాలు ఇళ్లలోకి రాకుండ, ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టి గేట్లు పెట్టుకుంటారు గ్రామస్తులు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వీడియోలో చిరుతపులి అంత పెద్ద గేటును సైతం అమాంతం దూకి, రెప్పపాటులో పెంపుడు కుక్కను ఎత్తుకెలింది. చిరుతపులి రాకను గుర్తించిన కొన్ని వీధి కుక్కలు మొరుగుతున్నాయి. గేటుకి లోపలున్న కుక్క కూడా చిరుతను గమనించి అరుస్తుండగా, ఒక్క ఉదుటున వచ్చిన చిరుత కుక్కను చట్టుక్కున ఎత్తుకెళ్లింది.

ఈదృశ్యాలు ఇంటి ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తమ కుక్కను చిరుత ఎత్తుకెళ్ళిందంటూ యజమాని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్న ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్, కొండ ప్రాంతాల్లో తిరుగాడే కుక్కలను చిరుతలు వేటాడడం సర్వసాధారణమని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో వీడియోను చూసి స్పందించిన నెటిజన్లు పెంపుడు కుక్కల పట్ల యజమానులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.