మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ : లిక్కర్ షాపులు వద్ద బారులు తీరిన జనాలు

  • Published By: madhu ,Published On : May 4, 2020 / 06:33 AM IST
మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ : లిక్కర్ షాపులు వద్ద బారులు తీరిన జనాలు

మద్యం షాపులు ఎప్పుడు తెరుచుకుంటాయా ? ఎప్పుడు బాటిల్ తీసుకోవాలి ? ఎప్పుడు గొంతులో పడుతుందా అని ఎదురు చూసిన వారి కోరిక నెరవేరింది. దాదాపు నెల రోజులకు పైగా మందు దొరక్క విలవిల్లాడిన మందుబాబులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.

దేశ వ్యాప్తంగా 2020, మే 04వ తేదీ సోమవారం నుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఉదయం నుంచే షాపుల ఎదుట బారులు తీరి నిలబడ్డారు. కేంద్రం విధించిన మార్గదర్శకాల ప్రకారం మద్యం షాపుల యజమానులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు పాటించడం లేదు. తమ వరకు వచ్చే సరికి మందు బాటిల్ దొరుకుతుందా ? లేదా ? అనే టెన్షన్ లో ఒకరినొకరిపై పడిపోతున్నారు. 

లాక్ డౌన్ సమయంలో మద్యం బాటిల్స్ భారీ రేట్లకు విక్రయించారు. చాలామటుకు సగం స్టాక్ అయిపోయి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. షాపులు తెరిచిన తర్వాత…ఎక్సైజ్ శాఖ చేరుకున్న తర్వాత..స్టాక్ ఎంక్వయిరీ చేస్తున్నారు. లెక్క కరెక్టు అనిపించిన తర్వాత..షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతినిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న మద్యం దుకాణ యజమానులు మందే ఏర్పాట్లు చేసుకున్నారు. 

ఇక తెలుగు రాష్టాల విషయానికి వస్తే..తెలంగాణలో మద్యం షాపులు తెరుచుకోలేదు. మే 07వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతున్నందున ప్రభుత్వం తెరవడానికి అనుమతినివ్వలేదు. కానీ..ఏపీ రాష్ట్రం మాత్రం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు ఓకే చెప్పింది. 25 శాతం ధరలు పెంచింది. దీంతో ఉదయం నుంచే జనాలు బారులు తీరి నిలబడ్డారు.

ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు విక్రయాలు జరుగనున్నాయి. కానీ..ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన సమయానికి షాపులు తెరవనివ్వలేదు. స్టాక్, తదితర కారాణాల వల్ల ఆలస్యం జరిగిందని..తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు మద్యం అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. 

లాక్‌డౌన్‌ 3.0 నిబంధనలకు అనుగుణంగా కంటైన్ మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఓ వైన్‌ షాప్‌ ఎదుట వేలాది మంది బారులు తీరారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ మద్యం సేల్స్ స్టార్ట్ అయ్యాయి. బాటిల్స్ తీసుకోవడానికి ఎగబడుతున్నారు. 

Also Read | లిక్కర్ షాపుకు కొబ్బరి కాయ కొట్టి…పూజలు