యూపీలో తొలి ‘లవ్ జిహాద్’ కేసు నమోదు

  • Published By: sreehari ,Published On : December 4, 2020 / 07:05 AM IST
యూపీలో తొలి ‘లవ్ జిహాద్’ కేసు నమోదు

Love jihad first case In UP under new law: యూపీలో బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టానికి ఆమోదం లభించిన వారం రోజుల్లోనే ‘లవ్ జిహాద్’పై డియోరానియా పోలీస్ స్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. బలవంతపు మత మార్పిడి చట్టం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఒక ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.



కేసు నమోదైన ఐదు రోజుల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 21ఏళ్ల ఓవైస్ అహ్మద్‌గా గుర్తించిన పోలీసులు బుధవారం సాయంత్రం బహేరి పట్టణంలోని మేజిస్ట్రేట్ ప్రియాంక అంజోర్ ఎదుట హాజరుపరిచారు. కొత్త చట్టం ప్రకారం.. ఇది మొదటి అరెస్టు అని బరేలీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ పాండే చెప్పారు. బహేది ప్రాంతంలోని రిచా రైల్వే గేట్ వద్ద నిందితుడు ఒవైస్ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.



గవర్నర్ ఆనందీబెన్ పటేల్ 2020లో ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి ఆర్డినెన్స్ నిషేధానికి అనుమతినిచ్చారు. ఈ చట్టం మత మార్పిడిని నాన్ బెయిల్ నేరంగా పరిగణిస్తారు. దోషిగా తేలితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. తన కుమార్తెను ఇస్లాం మతంలోకి మార్చమని అహ్మద్ బలవంతం చేశాడని బాధితురాలి తండ్రి టికరమ్ ఆరోపించారు. ఇస్లాం మతంలోకి మారకుంటే నిందితుడు తనను చంపేస్తానని బెదిరించాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. బరేలీలోని డియోరానియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత నవంబర్ 28న బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అహ్మద్‌ను అరెస్టు చేశారు.