Lucifer Remake: మోహన్ రాజా ఔట్.. మెగా రీమేక్ కోసం ఆగని దర్శకుడి వేట?

మెగాస్టార్ ఆ మధ్య కాస్త నెమ్మదించినా ఈసారి వరస సినిమాలతో ముందుకు రావాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే వరస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరు ఆ తర్వాత మరో రెండు రీమేక్ కథలను సిద్ధం చేసుకున్నాడు.

Lucifer Remake: మోహన్ రాజా ఔట్.. మెగా రీమేక్ కోసం ఆగని దర్శకుడి వేట?

Lucifer Remake Mohan Raja Out Non Stop Directors Hunt For Mega Remake

Lucifer Remake: మెగాస్టార్ ఆ మధ్య కాస్త నెమ్మదించినా ఈసారి వరస సినిమాలతో ముందుకు రావాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే వరస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరు ఆ తర్వాత మరో రెండు రీమేక్ కథలను సిద్ధం చేసుకున్నాడు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ రీమేక్‌తో పాటు వేదాళం రీమేక్‌లో మెగాస్టార్ న‌టించ‌బోతున్నాడు. ఆచార్య పూర్తికాకముందే లూసిఫర్ రీమేక్ కూడా మొదలుపెట్టాలని మెగా కాంపౌండ్ గట్టిగా ప్రయత్నించింది. కానీ, దర్శకుడే సెట్ కావడం లేదు.

నిజానికి ఏప్రిల్‌లోనే లూసిఫ‌ర్ రీమేక్ షూటింగ్‌ మొద‌లు పెట్టాల‌నుకున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు మోహ‌న్ రాజా స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. కానీ, ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నిజానికి ముందుగా ఈ రీమేక్ కోసం యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ ను అనుకున్నారు. ఆ తర్వాత మాస్ సినిమాలకు పేరైన వినాయక్ ఈ రీమేక్ తెరకెక్కిస్తాడని ప్రచారం జరిగింది. కానీ చివరికి మోహన్ రాజా అనువాదం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారు. అయితే, ఇప్పుడు ఆయన కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఆచార్య చేస్తున్న చిరు కరోనా కారణంగా కాస్త విరామం ఇచ్చారు. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ తో పాటు తమిళ వేదాళం రీమేక్ కూడా చేయనున్నారు. వేదాళం రీమేక్ కోసం దర్శకుడు మెహర్ రమేష్ ను ఖరారు చేయగా లూసిఫర్ కోసం మాత్రం దర్శకుడి వేట కొనసాగుతూనే ఉంది. దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేయగా దానిపై చిరు సంతృప్తిగా లేరనే కారణంగానే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని వినిపిస్తుంది. మరి చివరికి ఈ రీమేక్ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూడాల్సి ఉంది.