19 students covid : జవహర్ నవోదయ స్కూల్లో కరోనా..19 మంది విద్యార్ధులకు పాజిటివ్
మహారాష్ట్రలో కరోనా మరోసారి విజంభిస్తోంది. ప్రతీరోజు కొత్త కేసులు నమోదవుతున్న క్రమంలో ముంబైలోని స్కూల్లో 19 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

19 School Students Covid Positive In Maharashtra
19 School students covid positive in mumbai : మహారాష్ట్రలో కరోనా మరోసారి విజంభిస్తోంది. ప్రతీ రోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నవీ ముంబై అహ్మద్‌నగర్‌లోని నవోదయ స్కూల్లో 18 మంది విద్యార్థులకు కరోనా సోకగా.. తాజాగా మరో స్కూల్ కు చెందిన 19 మంది విద్యార్ధులకు వైరస్ సోకింది. టాక్లీ దోఖేశ్వర్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ సీబీఎస్ఈ అనుబంధ స్కూల్ అయిన జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూల్ లో దాదాపు 450 మంది విద్యార్థులు చదువుతున్నారు.
వారిలో కొంతమందికరోనా లక్షణాలు కనిపించటంతో కరోనా టెస్టులు చేయించగా.. 19 మందికి పాజిటివ్ నిర్థారణ అయిందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు. దీంతో బాధిత విద్యార్థులందరినీ పర్నర్ రూరల్ హాస్పిటల్లో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సనందిస్తున్నారు. వారినుంచి నమూనాలను సేకరించి..జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు స్టూడెంట్స్ తో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ గుర్తించి టెస్టులు చేసే పనిలో పడ్డారు. డిసెంబర్ నెలలో ముంబైలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ముఖ్యంగా జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూళ్లలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.