Maharastra Unlock: అన్ లాక్ దిశగా మహారాష్ట్ర.. ఐదు కేటగిరీలుగా విభజన!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి క్రమంగా తగ్గుతుందని వైద్యనిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు కూడా ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రోజుకి నాలుగైదు వేలల్లో మాత్రమే కొత్త కేసులు నమోదవుతుండగా..

Maharastra Unlock: అన్ లాక్ దిశగా మహారాష్ట్ర.. ఐదు కేటగిరీలుగా విభజన!

Maharastra Unlock

Maharastra Unlock: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి క్రమంగా తగ్గుతుందని వైద్యనిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు కూడా ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రోజుకి నాలుగైదు వేలల్లో మాత్రమే కొత్త కేసులు నమోదవుతుండగా ఆయా రాష్ట్రాలలో అన్ లాక్ ప్రయత్నాలు సాగుతున్నాయి. గత ఏడాది తొలి దశ నుండి ఈ ఏడాది రెండో దశ వరకు మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం పడుతుంది. దీంతో ప్రభుత్వం తాళం తీసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు వైద్యశాఖ, హోమ్ శాఖలతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం ఐదు కేటగిరీలుగా విభజించి అన్ లాక్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు నమోదయ్యే ప్రాంతాలు, ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్ తదితర వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాలలో అన్ లాక్ అమలు చేయనున్నారు.

ముందుగా పాజిటివిటీ రేటు 5% కంటే తక్కువ ఉండి.. ఆక్సిజన్ బెడ్స్ ఆక్యుపెన్సీ 25% శాతం ఉన్న ప్రాంతాలలో రెస్టారెంట్లు, మాల్స్, థియేటర్స్ వంటి వాటికి అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రజా రవాణాను యధావిధిగా పునరుద్ధరించుకొనే వెసులుబాటు ఇవ్వనున్నారు. ఇవన్నీ మొదటి దశలోకి రానున్నాయి. ఇక ఆక్సిజన్ బెడ్స్ ఆక్యుపెన్సీ 25 నుండి 40 శాతం ఉన్న ప్రాంతాలను రెండో కేటగిరీగా విభజించి లాక్ డౌన్ కుదించి 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఇక మిగతా మూడు కేటగిరీలలో కూడా ఆ ప్రాంతాలను బట్టి వెసులుబాటు నుండి కఠిన లాక్ డౌన్ వరకు అమలు చేయనున్నారు.