Samsung Galaxy S24 FE : భలే ఆఫర్ భయ్యా ఇది.. ఈ శాంసంగ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే..!
Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఖతర్నాక్ ఫోన్ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫ్యాన్స్ తప్పక కొనాల్సిన ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ S24 FE మోడల్ భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్‌తో గెలాక్సీ S24 లైనప్ నుంచి వేరియంట్‌గా వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగానే ఆకట్టుకుంది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో పాటు ధర కూడా తగ్గింపు పొందింది. అమెజాన్‌లో అసలు ధరపై దాదాపు 50 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. రూ. 35వేల కన్నా తక్కువ ధరకు ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ధర : శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అమెజాన్‌లో అసలు ధర రూ.59,999 నుంచి రూ.33,673కు లభిస్తుంది. ఇంకా, అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసే వినియోగదారులందరూ ఫోన్‌పై అదనంగా రూ.1,000 అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రస్తుతానికి సింగిల్ గ్రాఫైట్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 FE స్పెసిఫికేషన్లు ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2x డిస్‌ప్లేతో పాటు 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఎక్స్ క్లిప్స్ 940 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లకు సపోర్టు ఇస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ 3X ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ స్నాపర్ కూడా లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.
