భారత రాజ్యాంగంలో ‘హిందూ రాష్ట్రం’ అనే పదాన్ని చేర్చాలా? ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఏమన్నారు?
“సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎప్పటి నుంచి జరుగుతోందో తెలియదు. దానికి కూడా రాజ్యాంగ అనుమతి అవసరమా?” అని అన్నారు.
Mohan Bhagwat
Mohan Bhagwat: భారతదేశం “హిందూ దేశం” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అది పూర్తిగా సత్యం అని, దానికి రాజ్యాంగ అనుమతి కూడా అవసరం లేదని చెప్పారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ (Mohan Bhagwat) మాట్లాడుతూ.. దేశంలో భారత సంస్కృతిని గౌరవించినన్నాళ్లు భారత్ హిందూ దేశంగానే ఉంటుందని చెప్పారు.
“సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎప్పటి నుంచి జరుగుతోందో తెలియదు. దానికి కూడా రాజ్యాంగ అనుమతి అవసరమా? హిందుస్థాన్ హిందూ దేశం. భారత్‌ను తన మాతృభూమిగా భావించే ప్రతి ఒక్కరు భారత సంస్కృతిని ఆదరిస్తారు. హిందుస్థాన్ భూమిపై భారత పూర్వీకుల మహిమను నమ్మే ఒక్క వ్యక్తి జీవించి ఉన్నా భారత్ హిందూ దేశమే. ఇదే సంఘ్ సిద్ధాంతం” అని అన్నారు.
Also Read: అందుకే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడారు: మంత్రి ఉత్తమ్ రియాక్షన్
“పార్లమెంట్లో ఎప్పుడైనా రాజ్యాంగ సవరణ చేసి ఆ పదాన్ని చేర్చాలనుకుంటే చేర్చుతారు, చేర్చకపోయినా ఫర్వాలేదు. దీని గురించి మాకు అవసరం లేదు. మేము హిందువులం, మా దేశం హిందూ దేశం.. అదే సత్యం. జన్మ ఆధారిత కుల వ్యవస్థ హిందుత్వ లక్షణం కాదు” అని ఆయన అన్నారు.
భారతదేశం సంస్కృతి పరంగా హిందూ దేశమేనని ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుంచి చెబుతోంది. మెజారిటీ జనాభా హిందూ మతానికి చెందినదేనన్న అంశాన్ని కూడా గుర్తు చేస్తోంది. అయితే, రాజ్యాంగ ప్రవేశికలో ‘లౌకిక’ అనే పదం మొదట లేదు. 1976లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘సామ్యవాద’ పదంతో పాటు ‘లౌకిక’ పదాన్ని చేర్చారు.
రాజ్యాంగ ప్రవేశిక అంటే రాజ్యాంగ లక్ష్యాలు, విలువలు తెలిపే ప్రారంభ భాగం. లౌకిక అంటే మతాలన్నింటినీ ఒకేలా చూసే రాజ్య విధానం. సామ్యవాదం అంటే ఆర్థిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించి, దేశ వనరులను సామాజిక ప్రయోజనాలకు వాడడం.
