SSMB 28 : డ్యూయల్ రోల్ లో మహేశ్.. త్రివిక్రమ్ – మహేశ్ సినిమా SSMB28 కూడా పాన్ ఇండియానా??

SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

SSMB 28 : డ్యూయల్ రోల్ లో మహేశ్.. త్రివిక్రమ్ – మహేశ్ సినిమా SSMB28 కూడా పాన్ ఇండియానా??

Mahesh Babu playing Dual Role in SSMB 28 rumor goes viral

SSMB 28 :  అతడు(Athadu) , ఖలేజా(Khaleja) సినిమాల తర్వాత మహేశ్ బాబు(Mahesh Babu) అండ్ త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో మూడో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఆ మూవీ గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి(Sankranthi) కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులోనూ తండ్రీ కొడుకులుగా మహేశ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి.

తండ్రీకొడుకుల మధ్య సీన్స్ ఉంటాయా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి ఈ పుకార్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. ఈ పుకార్లు నిజమే అయితే మహేష్ బాబు డ్యూయల్ రోల్ కచ్చితంగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఖాయం. గతంలో నాని సినిమాలో కాసేపు డ్యూయల్ రోల్ చేసి అలరించాడు.

Sreeleela : ఇక అఫీషియల్.. పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల.. శరవేగంగా ఉస్తాద్ షూట్..

అలాగే మహేశ్ బాబు త్రివిక్రమ్ తర్వాత రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేశ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా అనుకున్నారు అంతా. కానీ తాజాగా మహేశ్-త్రివిక్రమ్ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి పాన్ ఇండియా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Image