Mahesh Upcoming Film: మహేష్ తర్వాత ప్రాజెక్టు మాంత్రికుడితోనేనా?

మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నాడు. మహేష్ సర్కారు వారి పాట అనంతరం రాజమౌళితో మరో సినిమా చేయనున్నాడని ప్రకటనలు వచ్చాయి. దాదాపుగా రాజమౌళి సినిమాకు మధ్యలో మరో సినిమాకు మహేష్ వద్ద ఛాన్స్ ఉంది. మహేష్ కోసం పలువురు స్టార్ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నా మహేష్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపే..

Mahesh Upcoming Film: మహేష్ తర్వాత ప్రాజెక్టు మాంత్రికుడితోనేనా?

Mahesh Upcoming Film Mahesh Will Be Doing A Film With Trivikram

Mahesh Upcoming Film: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నాడు. శ్రీమంతుడు సినిమా నుండి కాస్త క్లాస్ టచ్ ఉన్న పాత్రలతోనే కనిపించిన మహేష్ సర్కారు వారి పాటతో ఇంకొంచెం మాస్ లుక్ పెంచి కనిపించనున్నాడు. ఇప్పటికే బయటకొచ్చిన పోస్టర్స్ ను బట్టి చూస్తే.. ఇది ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే ఒక సామాన్యుడి కథగా ప్రచారం జరుగుతుండగా మహేష్ లుక్ మాస్, అగ్రెసివ్ గా కనిపిస్తుంది. పరుశురాం సినిమాలో హీరోను ఎలివేట్ చేసే విధానం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. దీంతో మహేష్ ను ఎలా చూపించనున్నాడా అని ఆసక్తి నెలకొంది.

కాగా మహేష్ సర్కారు వారి పాట అనంతరం రాజమౌళితో మరో సినిమా చేయనున్నాడని ప్రకటనలు వచ్చాయి. ఇటు మహేష్ నుండి.. అటు జక్కన్న నుండి కూడా ఈ సినిమాపై క్లారిటీ ఉంది. కానీ ఎప్పుడన్నదే ఇంకా ఖరారు కాలేదు. రాజమౌళి ప్రసుతం ఆర్ఆర్ఆర్ ను చెక్కే పనిలో ఉన్నాడు. కానీ మహేష్ మాత్రం సర్కారు వారి పాట చివరి దశకు తెచ్చేశాడు. అంటే దాదాపుగా రాజమౌళి సినిమాకు మధ్యలో మరో సినిమాకు మహేష్ వద్ద ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పుడు కొందరు దర్శకులు ఈ గ్యాప్ లో మహేష్ తో సినిమా కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు.

మహేష్ తర్వాత సినిమా కోసం పలువురు స్టార్ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నా మహేష్ మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపే మొగ్గుచూపినట్లుగా తెలుస్తుంది. మహేష్ 28వ సినిమాగా తెరకెక్కే ఈ సినిమాను త్రివిక్రమ్ టేకప్ చేయనున్నట్లుగా వినిపిస్తుంది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో అతడు అప్పట్లో భారీ సక్సెస్ దక్కించుకోకపోయినా ఇప్పటికి పెద్ద కల్ట్ క్లాసిక్ అయ్యిపోయింది. తర్వాత వచ్చిన ఖలేజా ఇప్పటికీ టీవీలో టీఆర్పీలకు ఢోకాలేదు. దీంతో ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు కాస్త ఫ్రెష్ ఫీల్ పక్కా అని టాక్ ఉంది. మరి మహేష్ మాంత్రికుడికే అవకాశం ఇస్తారా? ఇస్తే త్రివిక్రమ్ ఎలాంటి కథలో మహేష్ ను చూపించనున్నాడని ఇప్పుడే అభిమానులలో చర్చలు మొదలయ్యాయి.