Teeth Jewelry : చనిపోయిన వారి ఆవశేషాలతో ఆభరణాల తయారీ

ఇక్కడ తయారవుతున్న అవశేషాల ఆభరణాల్లో కంఠాభరణాలు, ఉంగరాలు, కంకణాలు ఉన్నాయి. వీటిలో దంతాలు, చితాభస్మం వంటి వాటిని పదిలంగా నిక్షిప్తం చేస్తారు.

Teeth Jewelry : చనిపోయిన వారి ఆవశేషాలతో ఆభరణాల తయారీ

మృతుల అవశేషాలతో ఆభరణాల తయారీ

Teeth Jewelry : మనిషి ప్రాణాలతో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అందరితో బంధాలు, భాందవ్యాలు బలంగా ఉంటాయి. ప్రాణం పోతే మాత్రం వారితో ఉన్న సంబంధాలన్ని తెగిపోతుంటాయి. వారి తాలూకా తీపి గుర్తులు మనస్సులో ఉంచుకోవటం తప్ప చేయగలిగింది ఏమి ఉండదు. మహా అయితే వారు వినియోగించిన వస్తువులను మాత్రం పదిలపరుచుకోగలం. అయితే, పోయిన వారి అవశేషాలను శాశ్వితంగా , గుర్తుగా ఉంచుకునే వీలు కల్పిస్తుంది ఆస్ట్రేలియాకు చెందిన ఓ జ్యుయలరీ దుకాణం… ఇంతకీ ఆ వివరాలేంటో పరిశీలిస్తే..

ఆస్ర్టేలియాకు చెందిన జాక్వి విలియమ్స్ అనేమహిళ గ్రేవ్ మెటాలమ్ పేరుతో జ్యువెలరీ షాపు నిర్వహిస్తోంది. ఈ ఆభరణాల దుకాణాని అక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడ తయారయ్యే ఆభరణాలన్నీ చనిపోయిన వారి అవశేషాలను నిక్షిప్తం చేస్తూ ప్రత్యేమైన డిజైన్లలో ఆభరణాలను తయారు చేస్తారు. చనిపోయిన తమవారిని మర్చిపోలేని వారు, తమతోపాటు వారి గుర్తులను పదిలంగా ఉంచుకోవాలనుకునే వారు, దంతాలు, కాలిపోయిన బూడిద, ఇతర ఎముకుల వంటి అవశేషాలను సేకరించి గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీ దుకాణంలో అందిస్తారు. వాటిని ఆభరణాల మధ్యలో నిక్షిప్తం చేసి కళాత్మకంగా తీర్చిదిద్ది తిరిగి అందిస్తారు.

ఇక్కడ తయారవుతున్న అవశేషాల ఆభరణాల్లో కంఠాభరణాలు, ఉంగరాలు, కంకణాలు ఉన్నాయి. వీటిలో దంతాలు, చితాభస్మం వంటి వాటిని పదిలంగా నిక్షిప్తం చేస్తారు. ఉంగరాలు, చైన్ లాకెట్లు, బ్రాస్ లైట్లు ఇలా వివిధ రూపాల ఆభరణాలను తమకు నచ్చినట్లు తయారు చేయించుకుంటారని మెల్బోర్నో లో ఉన్న గ్రేవ్ మెటాలమ్ ఆభరణాల దుకాణ యజమాని 29 సంవత్సరాల విలియమ్స్ చెబుతోంది. ఇలాంటి ఆభరణాలు తీపిగుర్తులుగా మిగిలిపోవటమేకాకుండా, దుఖా:న్ని దిగమింగుకునేందుకు దోహదపడతాయని విలియమ్స్ అంటుంది.

తమవారి అవశేషాలను ఆభరణాల రూపంలో భధ్రపరుచుకోవాలనుకున్న వారు, చనిపోయిన వారిని ఖననం చేయటానికి ముందుగానే అవశేషాలను సమీకరిస్తారు. సేకరించిన అవశేషాలను బంగారం, ప్లాటినం, వెండి, వంటి లోహాలతో కూడిన ఆభరణాల్లో నిక్షిప్తం చేస్తారు. మరికొంతమంది వాటి మధ్య వజ్రాలు, రత్నాలను సైతం పొదిగించుకుంటారు. ఒక్కొక్క ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చేందుకు 6 నుండి 8వారాల సమయం తీసుకుంటారు. ఇందుకు గాను ఎక్కవ మొత్తంలోనే చార్జ్ చేస్తారు.

విలియమ్స్ చేస్తున్న ఈపనిని చాలా మంది తొలినాళ్ళల్లో హేళనగా చూశారు. అయితే ఆతరువాత కాలంలో స్నేహితులు, కుటుంబసభ్యులు ప్రోత్సహించటం, అందరూ ఈ తరహా అవశేషాలను నిక్షిప్తం చేసే ఆభరణాలపై మక్కువ చూపించటంతో ప్రస్తుతం ఆమె దుకాణం పాపులర్ గా మారింది.