Anju Krishna : డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన సౌత్ యాక్ట్రెస్..

దేశంలో డ్రగ్స్ ఒక వీడని భూతంగా మారింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, డ్రగ్స్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఒక సౌత్ యాక్ట్రెస్ డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది.

Anju Krishna : డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన సౌత్ యాక్ట్రెస్..

Malayala Actress Anju Krishna arrested in drugs case

Updated On : March 22, 2023 / 6:26 PM IST

Anju Krishna : దేశంలో డ్రగ్స్ వినియోగం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, డ్రగ్స్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. మొన్నటి వరకు ఈ కల్చర్ సిటీస్ లోనే ఉండేది. కానీ ఇటీవల కాలంలో టౌన్స్ కి కూడా చేరుకుంది. ఇక సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, హీరో, హీరోయిన్లు పలుమార్లు పోలీస్ విచారణలు ఎదురుకున్నారు. తాజాగా ఒక సౌత్ యాక్ట్రెస్ డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది.

Niharika Konidela : గేమ్ సిరీస్‌తో రాబోతున్న నిహారిక కొణిదెల..

మలయాళ పరిశ్రమలో థియేటర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న అంజు కృష్ణ (Anju Krishna).. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే పెద్దగా అవకాశాలు అందకపోవడంతో బెంగళూరు నుంచి డ్రగ్స్ ని తీసుకు వచ్చి కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో విక్రయించడం మొదలు పెట్టింది. అంజు కృష్ణకి మూడేళ్ళ క్రితం కాసర్‌గోడ్‌కి చెందిన షామీర్ తో పరిచయమైంది. వీరిద్దరూ కలిసి ఒక నెల క్రితం కొచ్చి త్రిక్కక్కరాలోని ఉనిచిర థోపిల్ జంక్షన్ వద్ద ఒక అపార్ట్‌మెంట్ లో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అంజు కృష్ణ, షామీర్ దంపతులు అంటూ ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

Kantara-2 : కాంతార-2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..

ఇక వీరు డ్రగ్స్ విక్రయిస్తున్నారు అని తెలుసుకున్న పోలీసులు.. సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అంజు కృష్ణ ఇంటి పై దాడి చేశారు. దాడి సమయంలో షామీర్, మరికొంత మంది యువతీయువకులు ఇంటి వద్దనే ఉన్నారు. పోలీసులు రావడం గమనించిన షామిర్ అండ్ యువతీయువకులు అక్కడి నుంచి గోడ దూకి పరారీ అయ్యారు. అంజుకృష్ణ మాత్రం ఇంటిలో ఉండడంతో దొరికిపోయింది. ఇంటిలో 56 గ్రాములు సింథటిక్ ఎండీ ఎంఏ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న షామీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.