presidential elections: ‘15న ఢిల్లీకి రండి’ అంటూ సోనియా, కేసీఆర్ స‌హా 22 మందికి మ‌మ‌త లేఖ‌లు

రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానున్న నేప‌థ్యంలో ఎన్డీఏకి దీటుగా విప‌క్ష పార్టీల నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు.

presidential elections: ‘15న ఢిల్లీకి రండి’ అంటూ సోనియా, కేసీఆర్ స‌హా 22 మందికి మ‌మ‌త లేఖ‌లు

Mamata

presidential elections: రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానున్న నేప‌థ్యంలో ఎన్డీఏకి దీటుగా విప‌క్ష పార్టీల నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా 22 మంది విప‌క్ష పార్టీల‌ నేతలకు మమతా బెనర్జీ లేఖలు రాశారు. రాష్ట్రపతి ఎన్నికలపై చ‌ర్చించేందుకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో స‌మావేశానికి రావాల‌ని ఆమె ఆహ్వానించారు.

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో త్రిముఖ పోరు? కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..

ఈ సమావేశంలో పాల్గొనాల‌ని కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కూడా మ‌మ‌తా బెన‌ర్జీ ఆహ్వానించారు. అలాగే, ఎన్డీయేతర పార్టీల అధినేతలకూ ఆమె ఆహ్వానం పంపారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆర్ఎల్డీ జాతీయ అధ్య‌క్షుడు జయంత్ చౌదరి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్ర‌ధాని, ఎంపీ దేవెగౌడ, జేకేఎన్సీ అధ్య‌క్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్య‌క్షురాలు మెహబూబా ముఫ్తీ, శిరోమణి అకాలీదళ్ అధ్య‌క్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్య‌క్షుడు పవన్ చామ్లింగ్, ఐయూఎంఎల్ అధ్య‌క్షుడు కాదర్ మొహిదీన్‌కు కూడా మ‌మ‌తా బెన‌ర్జీ ఆహ్వానం పంపారు.

prophet row: ముస్లిం దేశాల‌న్నీ భార‌తీయ‌ ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాలంటూ బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌లు

సీఎం కేసీఆర్ కి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌త్యేకంగా ఫోన్ చేసి, ప‌లు అంశాల‌పై మాట్లాడారు. వైసీపీ, టీడీపీలకు మమతా బెనర్జీ ఆహ్వానం పంపకపోవడం గమనార్హం. కాగా, జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. అదే నెల‌ 21న ఫలితాలు వెల్లడవుతాయి. జూలై 24తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పదవీకాలం ముగుస్తుంది.