Manchu Vishnu : మంచు విష్ణు చెప్తానన్న గుడ్‌న్యూస్ ఇదేనా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 'మా' పనులపై దృష్టిపెట్టారు.

Manchu Vishnu : మంచు విష్ణు చెప్తానన్న గుడ్‌న్యూస్ ఇదేనా?

Manchu Vishnu

Updated On : October 21, 2021 / 9:39 PM IST

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ‘మా’ పనులపై దృష్టిపెట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ ఫైల్‌పై సైన్ చేశారు విష్ణు.. ఇక ఇప్పుడు ‘మా’ సొంత భవనంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిస్తే ‘మా’కి స్వంత భవనం నిర్మిస్తానని వాగ్దానం చేసిన విష్ణు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

చదవండి : Manchu Vishnu Tweet: పవన్ కల్యాణ్.. నేనూ మాట్లాడుకున్నాం.. కావాలంటే చూడండి..!

ఇక ఇప్పటికే భవన నిర్మాణానికి రెండు, మూడు చోట్ల స్థలాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే గురువారం ట్వీట్ చేశారు విష్ణు. ‘మా’కు సంబంధించి రేపు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ హింట్‌ ఇచ్చాడు. ఈ మేరకు ట్వీట్‌ చేశాడు.