Director Maruthi : ఇండస్ట్రీలో వాడుకొని వదిలేస్తారు.. కాని : మారుతి

ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ.. అందరూ కరోనా భయంతో ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మరీ భయపడ్డారు. అలాంటి వాళ్ళ భయానికి హాస్యాన్ని జోడించి తీయాలి అనుకున్నాను అని అన్నారు. 20 రోజుల్లో ఈ కథ

Director Maruthi : ఇండస్ట్రీలో వాడుకొని వదిలేస్తారు.. కాని : మారుతి

Maruthi

Director Maruthi :  మారుతీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా రాబోతున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కి గోపీచంద్ గెస్ట్ గా వచ్చారు. డైరెక్టర్ మారుతి చిన్న బడ్జెట్‌లో సినిమాను తీయగలడు. భారీ బడ్జెట్ చిత్రాలనూ హ్యాండిల్ చేయగలడు. ఏ సినిమా తీసినా మారుతి హాస్య ధోరణి మార్క్ మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది. కరోనా రాకముందు గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను మొదలుపెట్టాడు. మధ్యలో కరోనా రావడం, షూటింగ్‌లు బంద్ అయిపోవడంతో మారుతి ఈ గ్యాప్ లో ఒక చిన్న సినిమాని ప్లాన్ చేసాడు.

AHA : ఆహా అవార్డ్స్.. మొట్టమొదటి ఓటిటి అవార్డ్స్.. మీరే ఎన్నుకోండి

ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ.. అందరూ కరోనా భయంతో ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మరీ భయపడ్డారు. అలాంటి వాళ్ళ భయానికి హాస్యాన్ని జోడించి తీయాలి అనుకున్నాను అని అన్నారు. 20 రోజుల్లో ఈ కథను రాసి ముప్పై రోజుల్లో సినిమాను పూర్తి చేసాను. చాలా తక్కువ బడ్జెట్‌తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను. అనుకున్న బడ్జెట్ లోనే సినిమా తీశారన్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో ఏదో టైం పాస్‌కు తీసినట్టు తీశాను సినిమాని కానీ సినిమా చాలా సీరియస్‌గా వచ్చింది అని అన్నారు. ఈ చిత్రం మనసుకు వేసే వ్యాక్సిన్ మీ భయాలను అన్నింటిని పోగొడుతుందని మారుతి అన్నారు.

Puneeth rajkumar : పునీత్ అంతక్రియలకు తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

మారుతి ఈ సినిమా నిర్మాతల గురించి మాట్లాడుతూ.. వర్షం లాంటి హిట్ ఇవ్వడంతో ప్రభాస్ ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాడు. యూవీ క్రియేషన్స్ సంతోష్‌తో సినిమాలు తీస్తోంది. మాములుగా అయితే ఇండస్ట్రీలో వాడుకుని వదిలేస్తారు. నాకు అది తెలుసు. కాని యువి క్రియేషన్స్ వాళ్ళు వారికి ఎవరైనా రూపాయి ఇస్తే వందరూపాయలు తిరిగి ఇస్తారు. ఎవ్వరి రుణాన్ని ఉంచుకోరు అంటూ యూవీ క్రియేషన్స్, వంశీ, ప్రమోద్, ప్రభాస్ గురించి మారుతి గొప్పగా చెప్పారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది.