AHA : ఆహా అవార్డ్స్.. మొట్టమొదటి ఓటిటి అవార్డ్స్.. మీరే ఎన్నుకోండి

ఇప్పటివరకు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఆహా ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ కూడా చేప్పట్టబోతోంది. ఆహాలో ఇప్పటి వరకు వచ్చిన ఒరిజినల్ కంటెంట్ లోని నటీనటులు, సాంకేతిక నిపుణులను ఆహా

AHA : ఆహా అవార్డ్స్.. మొట్టమొదటి ఓటిటి అవార్డ్స్.. మీరే ఎన్నుకోండి

Aha Awards

Updated On : October 31, 2021 / 9:21 AM IST

AHA :  కరోనా సమయంలో థియేటర్లు లేకపోవడంతో ఓటిటికి డిమాండ్ పెరిగింది. అప్పటికే నేషనల్, ఇంటర్నేషనల్ ఓటిటిలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటికి ధీటుగా కేవలం తెలుగు వాళ్ళకోసం తెలుగు ఓటిటి వచ్చింది. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ‘ఆహా’ అంటూ కొత్త ఓటిటి వచ్చింది. 100 శాతం తెలుగు కంటెంట్ తో వచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ పెద్ద పెద్ద ఓటీటీలకు పోటీగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్ ని అందించడానికి ట్రై చేస్తున్నారు ఆహా బృందం. ఇందులో భాగంగానే సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలు, షార్ట్ ఫిలిమ్స్ ని ఆహా ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. వీటికి మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో ఇంకా కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలను ప్లాన్ చేస్తుంది ఆహా. ఆహా ప్రారంభమై ఇప్పటికే 20 నెలలు పూర్తి చేసుకుంది.

Bigg Boss 5 : రెచ్చగొట్టిన షన్ను.. బయటకొచ్చి కొడతా అన్న సన్నీ..

ఇప్పటివరకు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఆహా ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ కూడా చేప్పట్టబోతోంది. ఆహాలో ఇప్పటి వరకు వచ్చిన ఒరిజినల్ కంటెంట్ లోని నటీనటులు, సాంకేతిక నిపుణులను ఆహా టీమ్ అవార్డ్స్ తో సత్కరించాలని అనుకుంటుంది. ఇందుకోసం ‘ఆహా అవార్డ్స్’ ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రేక్షకులని ఓట్లు వేయమని ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మీకు ఇష్టమైన యాక్టర్స్ మరియు అత్యంత ఇష్టమైన కథలను సెలబ్రేట్ చేసుకునే సమయం ఇది. ఆహా పీపుల్ ఛాయిస్ అవార్డులను అందజేయడం అనేది కళను మరియు కళాకారులను గౌరవించుకోవడంగా భావిస్తున్నాం అని ‘ఆహా’ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో పాటు ప్రేక్షకులు ఉత్తమమైన వారికి ఓట్ చేయవలసిందిగా ఓ లింక్ ని కూడా పోస్ట్ చేసింది. ఇందులో వెబ్ సిరీస్, మూవీస్, షో లలో బెస్ట్ సెలెక్ట్ చేయండి అంటూ తెలిపారు.

Puneeth Rajkumar : పునీత్ కి ఉన్న చిరకాల కోరిక తీరేలోపే మరణం..

మూవీస్, వెబ్ సిరీస్ లలో సపరేట్ గా రెండు సెక్షన్స్ లోను బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ వెబ్ సిరీస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ మేల్, బెస్ట్ యాక్టర్ ఫిమేల్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ డెబ్యూట్ మేల్, బెస్ట్ డెబ్యూట్ ఫిమేల్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు షోస్ కోసం బెస్ట్ నాన్ ఫిక్షన్ వంటి కేటగిరీలను ఉంచారు.