Raviteja 70: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. 70వ సినిమాకి ముహూర్తం!

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఈ ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తొలి బోణీ కొట్టింది..

Raviteja 70: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. 70వ సినిమాకి ముహూర్తం!

Raviteja

Raviteja 70: మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఈ ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తొలి బోణీ కొట్టింది రవితేజనే. క్రాక్ సినిమాతో రవితేజ ఈ ఏడాది తొలి సక్సెస్ కొట్టడమే కాదు.. కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమాకు వస్తారనే నమ్మకాన్ని కూడా కలిగించాడు. అక్కడ నుండి మొదలైన రవితేజ హవా వరస సినిమాలతో ఎక్కడా ఆగడం లేదు. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టేశాడు.

Raviteja: గ్యాంగ్‌స్టర్ కథతో మాస్‌రాజా పాన్‌ ఇండియా ప్రయత్నాలు!

ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేసిన ‘ఖిలాడీ’ సినిమా విడుదలకి సిద్దమవగా.. ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే మరో సినిమా కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా ముమ్మర షూటింగ్ లో ఉండగా.. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకముందే మరో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన రవితేజ అక్టోబర్ 4 నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నాడు. ఇక, ఆ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

Raviteja-Boyapati Combination: బోయపాటితో మాస్ రాజా.. భద్ర రిపీట్ చేస్తారా?

ఆదివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రవితేజ కొత్త సినిమా వివరాలను రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇది రవితేజ కెరీర్ లో 70వ సినిమా. నక్కిన త్రినాధరావు సినిమా ధమాకా 69వ సినిమా కాగా దీంతో మొత్తం ఇప్పుడు రవితేజ లైన్ అప్ లో నాలుగు సినిమాలుంటాయి. మరి ఈ కొత్త ప్రాజెక్ట్ రవితేజ ఎవరితో ప్లాన్ చేయనున్నాడు.. అసలు పూర్తి వివరాలు ఏంటన్నది ఆదివారం ఉదయం వరకు వేచి ఉండాల్సిందే!