Theatrical Releases : ఈ వారం థియేటర్స్ లో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే..

మే నెల నాలుగో వారం కూడా ఆల్మోస్ట్ అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి తెలుగులో. కాకపోతే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలన్నిటిపై మంచి బజ్ ఉంది. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్స్, ప్రమోషన్స్ తో ఈ సినిమాలపై మంచి ఆసక్తి నెలకొంది.

Theatrical Releases : ఈ వారం థియేటర్స్ లో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే..

May 4th week Theatrical Releasing Movies

Theatrical Releases :  ప్రతి సమ్మర్(Summer) కి పెద్ద హీరోల సినిమాలు ఉంటాయి. కానీ ఈ సమ్మర్ లో మాత్రం అన్ని చిన్న, మీడియం సినిమాలే వస్తున్నాయి. మే నెల నాలుగో వారం కూడా ఆల్మోస్ట్ అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి తెలుగులో. కాకపోతే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలన్నిటిపై మంచి బజ్ ఉంది. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్స్, ప్రమోషన్స్ తో ఈ సినిమాలపై మంచి ఆసక్తి నెలకొంది.

MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర జంటగా తెరకెక్కిన సినిమా మళ్ళీ పెళ్లి(Malli Pelli). ఇటీవల సీనియర్ నటుడు నరేశ్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ నటుడు శరత్ బాబు చివరి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కానుంది.

Image

యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్(Memu Famous). చాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు 30 మంది కొత్త నటీనటులు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ మాత్రం భారీగా, డిఫరెంట్ గా చేస్తున్నారు. తెలంగాణ కథతో రూపందించిన సినిమాగా తెలుస్తోంది. ఈ సినిమాపై తెలంగాణాలో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా మే 26న రిలీజ్ చేస్తున్నారు.

Image

బ్రహ్మాజీ, నరేష్ అగస్త్య, హర్ష.. పలువురు యువ నటులు ముఖ్య పాత్రలతో తెరకెక్కుతున్న సినిమా #MENTOO. మగాళ్ల సమస్యలు, బాధలపై తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో బాగా పాపులర్ అయింది. ఈ సినిమా కోసం మగాళ్లైతే బాగా వెయిట్ చేస్తున్నారు. తమ కష్టాలను ఒక్కరన్నా చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా మే 26న విడుదల కానుంది.

Image

టోవినో థామస్ ముఖ్య పాత్రలో మలయాళంలో తెరకెక్కిన సినిమా 2018. కేరళలో 2018 లో వచ్చిన వరదల వల్ల జరిగిన ప్రాణ, ధన నష్టం, ఆ వరదల వల్ల పడ్డ ఇబ్బందుల ఆధారంగా తెరకెక్కిన సినిమా 2018. మలయాళంలో ఇప్పటికే రిలీజయి పెద్ద విజయం సాధించి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు తెలుగులో నిర్మాత బన్నీ వాసు దీన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

Image

Hansika Motwani : డేట్ కి రమ్మంటూ ఆ హీరో నన్ను బాగా ఇబ్బందిపెట్టాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు..

ఇవే కాక కరాళ, హీరో ఆఫ్ ఇండియా, గ్రే.. లాంటి పలు చిన్న సినిమాలు కూడా మే 26న విడుదల అవుతున్నాయి.