KTR On Medico Preethi : మెడికో ప్రీతి కేసు.. నిందితుడు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టం-మంత్రి కేటీఆర్

ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవరైనా సరే.. వాడు సైఫ్ కావొచ్చు, సంజయ్ కావొచ్చు, ఇంకోడు కావొచ్చు. ఎవరైనా సరే, వాడిని వదిలిపెట్టం. తప్పకుండా న్యాయ పరంగా, చట్ట పరంగా శిక్ష కూడా వేస్తాం.

KTR On Medico Preethi : మెడికో ప్రీతి కేసు.. నిందితుడు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టం-మంత్రి కేటీఆర్

KTR On Medico Preethi : మెడికో ప్రీతి మరణంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు మంత్రి కేటీఆర్. నిందితుడు సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు కేటీఆర్.

విపక్షాలు ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. వరంగల్ కేఎంసీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్ కు గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read..Harassment Student Died : మెడికో ప్రీతి ఘటన మరువకముందే మరో దారుణం.. సీనియర్ వేధింపులకు విద్యార్థిని బలి

ఆ అమ్మాయి చనిపోతే అందరం కూడా బాధపడ్డాం. సత్యవతి, కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు. నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా పార్టీ తరపున, ప్రభుత్వం తరపున సంతాపం తెలుపుతున్నా. ఆ కుటుంబాన్ని విపక్షాలు రాజకీయంగా వాడుకోవచ్చు, నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు.

కానీ, ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే.. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవరైనా సరే.. వాడు సైఫ్ కావొచ్చు, సంజయ్ కావొచ్చు, ఇంకోడు కావొచ్చు. ఎవరైనా సరే, వాడిని వదిలిపెట్టం. తప్పకుండా న్యాయ పరంగా, చట్ట పరంగా శిక్ష కూడా వేస్తాం.

Also Read..Medico Preeti : ప్రీతిది ముమ్మాటికీ మర్డరే.. తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. హైదరాబాద్‌ నిమ్స్‌లో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. వెంటిలేటర్, ఎక్మో‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం రాత్రి 9.16 గంటలకు ప్రీతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఈ నెల 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించింది. తొలుత ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమెను బతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయినా, ఫలితం లేకపోయింది.

తమ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు.. ఆమె మ‌ృతితో గుండె పగిలేలా విలపించారు. తమ కూతురు పెద్ద ఆశయంతో ఉండేదని, ఆమెతో పాటు ఆ ఆశయం కూడా చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారని, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.