Annie : ఐదుగురు మహిళా ఒలింపిక్ అథ్లెట్లకు ట్రైనింగ్ ఇచ్చింది ఈ పీటీ టీచరే

టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటారు. పతకాల పంట పండించారు. కాగా, ఒలింపిక్స్ లో మహిళా అథ్లెట్ల సక్సెస్ వెనుక

Annie : ఐదుగురు మహిళా ఒలింపిక్ అథ్లెట్లకు ట్రైనింగ్ ఇచ్చింది ఈ పీటీ టీచరే

Annie Varghese

Annie Varghese : టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటారు. పతకాల పంట పండించారు. కాగా, ఒలింపిక్స్ లో మహిళా అథ్లెట్ల సక్సెస్ వెనుక ఓ మహిళా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీటీ టీచర్) ఎనలేని పాత్ర ఉందనే విషయం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆమే ప్రొఫెసర్ అన్నీ వర్గీస్. కేరళలోని త్రిసూర్ విమలా కాలేజీ పీటీగా పని చేశారు. కేరళకు చెందిన ఐదుగురు మహిళా ఒలింపియన్లకు ఆమె శిక్షణ ఇచ్చారు.

అంజూ బాబీ జార్జి. 2004, 2008లో భారత్ తరుఫున ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. రూసా కుట్టీ 1996 ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. విమలా కాలేజీ నుంచి ఒలింపిక్స్ కు వెళ్లిన తొలి ఉమెన్ అథ్లెట్ రూసా కుట్టీ. జిన్సీ ఫిలిప్, మంజిమా కురైకోస్ 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో 4*400 రిలేమీ బృందంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. బాబీ అలాయ్ సిస్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించారు.

ఇక పాలక్కాడ్ జిల్లా మెర్సీ కాలేజీ నలుగురు ఒలింపియన్లను ఇచ్చింది. పీటీ ఉష, ఎండీ వలసమ్మ, మెర్సీ కుట్టన్, కే సారమ్మ వారిలో ప్రముఖులు. ప్రొఫెసర్ వర్గీస్ విమలా కాలేజీలో 31ఏళ్లు పీటీగా పని చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. 1967లో ఆమె జర్నీ ప్రారంభమైంది. 1998లో పదవీ విరమణ చేసే వరకు పీటీగానే ఉన్నారు. తను ఆ కాలేజీలో పీటీ గా చేరిన సమయంలో కనీసం సరైన మైదానం కూడా లేదని ఆమె గుర్తు చేసుకున్నారు.

మాకు టెన్నిస్, బాస్కెట్ బాల్ క్రీడల కోసం కోర్టులు ఉన్నాయి. కానీ, అథ్లెట్స్ కోసం ట్రాక్స్ లేవు. అయినా అథ్లెట్స్ ను నిరాశపరచలేదు. మా కాలేజీ పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ ను వాడుకున్నాం. తెల్లవారుజామునే అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ చేసే వాళ్లం అని వర్గీస్ చెప్పారు.

ఓసెప్, జార్జ్.. వీరు కూడా కోచ్ లే. ఒలింపిక్ అథ్లెట్లు తయారు చేయడంలో వారి పాత్ర కూడా ఉందని వర్గీస్ చెప్పారు. మేం ముగ్గురం అథ్లెట్లకు శిక్షణ ఇచ్చామన్నారు. మా కాలేజీ యాజమాన్యం క్రీడాలను బాగా ప్రోత్సహించేది. యాజమాన్యం, నన్స్, ఇతర సిబ్బంది అన్ని రకాలుగా నాకు సాయం అందించారు. విమలా కాలేజీ మాకు ఇంటి కన్నా ఎక్కువ. మేము సాధించిన అన్ని విజయాలు బెస్ట్ కోచ్ లు, ప్రొఫెసర్ అన్నీ వర్గీస్ మద్దతుతోనే సాధ్యం అయ్యాయని జార్జ్ చెప్పారు.

ఫిలిప్ 2000 సమ్మర్ ఒలింపిక్స్ 4*400 మీటర్ల రిలేలో పాల్గొన్నారు. తన అనుభవాలు షేర్ చేసుకున్నారు. ప్రొఫెసర్ వర్గీస్ దయా హృదయులు. తన దగ్గర ఎలాంటి క్రీడా వస్తువులు ఉండేవి కావని, ఆ సమయంలో ప్రొఫెసర్ వర్గీస్ తనకు జత స్పైక్స్ గిఫ్ట్ గా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ వర్గీస్.. విద్యార్థులకు బేసిక్స్ నేర్పడమే కాదు.. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. అంతేకాదు ఆర్థిక సాయం కూడా చేశారు.