Chiranjeevi : ఈ లైనప్ ఏంటి బాసు.. మరో సినిమా ఓకే చేసిన మెగాస్టార్.. నిర్మాతగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..

యువ హీరోలకి చేతిలో రెండో, మూడో సినిమాలు ఉంటే మెగాస్టార్ కి మాత్రం వాళ్ళకంటే డబల్ సినిమాలు ఉన్నాయి. 66 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ...................

Chiranjeevi : ఈ లైనప్ ఏంటి బాసు.. మరో సినిమా ఓకే చేసిన మెగాస్టార్.. నిర్మాతగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..

Chiranjeevi

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీలో అదరగొడుతున్నారు. ఇటీవల ఆచార్య సినిమాతో మెప్పించిన చిరంజీవి వరుస సినిమాలతో యువ హీరోలకి పోటీ ఇస్తున్నారు. యువ హీరోలకి చేతిలో రెండో, మూడో సినిమాలు ఉంటే మెగాస్టార్ కి మాత్రం వాళ్ళకంటే డబల్ సినిమాలు ఉన్నాయి. 66 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ ఫైట్స్, డ్యాన్సులతో ఇంకా అదరగొడుతూ మెగాస్టార్ అంటే ఎప్పటికి మెగాస్టారే అని చెప్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా, బాబీ దర్శకత్వంలో మరో సినిమా ఇప్పటికే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాని అనౌన్స్ చేశారు. ఇటీవలే హరీష్ శంకర్ తో కూడా సినిమా చేస్తా అని మాట ఇచ్చారు. తాజాగా చిరంజీవి మరో సినిమాని ఓకే చేశారు. ఈ సినిమాని ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి, నిర్మాత రాధికా శరత్ కుమార్ నిర్మించనుంది.

Vishwaksen : నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసిన హీరో విశ్వక్సేన్

ఈ మేరకు రాధికా శరత్ కుమార్ అధికారిక ప్రకటన చేసింది. రాధికా తన ట్విట్టర్ లో.. ”మా రాడాన్ నిర్మాణ సంస్థలో సినిమా చేయటానికి ఒప్పుకున్న నా ప్రియ మిత్రుడు చిరంజీవికి ధన్యవాదాలు. కింగ్‌ ఆఫ్‌ మాస్‌ అయిన మీతో ఓ బ్లాక్‌ బస్టర్‌ తీయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. మరి ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎలాంటి కథాంశంతో తీస్తారో చూడాలి.