Mohan Babu: సిరివెన్నెల అంత్యక్రియలకు దూరమైన మంచు ఫ్యామిలీ.. కారణమిదే

తట్టిలేపే విప్లవ పాట నుండి మనసు పొరలను స్పృశించే భావోద్వేగ భరిత గీతాలు.. చక్కిలిగింత కలిగించే సరస పద్యాలూ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి అలవోకగా..

Mohan Babu: సిరివెన్నెల అంత్యక్రియలకు దూరమైన మంచు ఫ్యామిలీ.. కారణమిదే

Mohan Babu

Mohan Babu: తట్టిలేపే విప్లవ పాట నుండి మనసు పొరలను స్పృశించే భావోద్వేగ భరిత గీతాలు.. చక్కిలిగింత కలిగించే సరస పద్యాలూ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి అలవోకగా జాలువారి తెలుగు ప్రజలకు వినసొంపుగా వినిపించేవి. తెలుగుపాటకు కోట కట్టిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇప్పుడు మన మధ్య లేరు. ఆయ‌న మృతి సాహిత్య లోకానికి తీర‌ని విషాదాన్ని మిగిల్చగా.. సరస్వతి పుత్రుడు దూరం కావడంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

UnstoppableShannu: సోషల్ మీడియాలో షన్ను షేక్.. లక్షలకొద్దీ ట్వీట్లు!

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పనులను వాయిదా వేసుకొని ఆయనకు ఘననివాళితో సత్కరించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, జగపతిబాబు, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రానా, నాని, సుధీర్‌బాబు, నాగబాబు, శర్వానంద్‌, శివబాలాజీ, నరేశ్‌, వరుణ్‌సందేశ్‌, తివిక్రమ్‌, రాజమౌళి, కీరవాణి, ఆర్పీ పట్నాయక్‌, తనికెళ్ల భరణి తదితర సినీ ప్రముఖులంతా సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

RRR: బ్లాస్టింగ్ అప్డేట్.. డిసెంబర్ 9న ట్రైలర్!

అయితే, టాలీవుడ్ ప్రముఖ కుటుంబాలలో ఒకటైన మంచు ఫ్యామిలీ నుండి ఎవరూ సీతారామశాస్త్రి అంత్యక్రియలలో కనిపించలేదు. దీంతో పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా దీనికి మోహన్ బాబు వివరణ ఇచ్చారు. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.. ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపిన మోహన్ బాబు.. అదేరోజు మా ఇంట్లో నా తమ్ముడు మృతిచెందడంతో విషాదంలో ఉన్నాం. ఆ సమయంలో ఇంట్లో ఎవరు బయటికి వెళ్ల‌కూడదనే కారణంగానే ఎవరిని వెళ్ళొద్దని చెప్పానని వెల్లడించారు.