Mohan Babu : జీవితంలో రిస్కులు చేయాలి.. ఒక్క పాట కోసం చాలా ఖర్చుపెట్టాం

ఈ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. ''నా కుటుంబానికి ఊపిరి సినిమా. ఏమి లేకుండా వచ్చి అంచలంచలుగా ఎదిగి ఒక యునివర్సిటీ అయ్యింది. 1982లో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అన్న గారితో.........

Mohan Babu : జీవితంలో రిస్కులు చేయాలి.. ఒక్క పాట కోసం చాలా ఖర్చుపెట్టాం

Mohan Babu

Son Of India :   మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ లీడ్ రోల్ లో సినిమా చేస్తున్నారు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో మంచు విష్ణు నిర్మాణంలో మోహన్ బాబు హీరోగా ‘సన్ ఆఫ్ ఇండియా’ తెరకెక్కింది. ఈ సినిమాని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయబోతున్నారు. శనివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

 

ఈ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. ”నా కుటుంబానికి ఊపిరి సినిమా. ఏమి లేకుండా వచ్చి అంచలంచలుగా ఎదిగి ఒక యునివర్సిటీ అయ్యింది. 1982లో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అన్న గారితో స్టార్ట్ చేయించాను. జీవితంలో కొన్ని కొన్ని రిస్క్ చేయాలి, చేశాను. నేను తీసుకున్న రిస్కులే నన్ను నిలబెట్టాయి. జీవితంలో రిస్క్ లేకుండా ఏది జరుగదు. రత్నబాబు కథ చెప్పినప్పుడు వెంటేనే ఓకే చేశాను. విష్ణు కూడా ఓకే చెప్పాడు.

Tollywood : సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వంతో.. వర్మ, చిరు, పవన్.. ఎవరు కరెక్ట్?

ఈ సినిమాలో రాజకీయం ఉంది, ఫ్యామిలీ ఉంది. పవర్ ఫుల్ డైలాగ్స్ వున్నాయి. ఇందులో ఒక్క సాంగ్ కోసం డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు పెట్టాం. ఆ సాంగ్ కోసం బాగా కష్టపడ్డాం. సాంగ్ బాగా వచ్చింది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మంత్రి పచ్చల హారం ఇస్తాను అంటాడు. అప్పట్లో వెంకటేశ్వర స్వామి నగలు దొంగలించారు. నేను లోకల్ గా ఉన్నాను. నాకు అన్ని విషయాలు తెలుసు. ఇందులో రాజకీయాలపై అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి.

Dimple Hayathi : ఒక్కపాట కోసం ఆరు కిలోల బరువు తగ్గిన హీరోయిన్

నిజమైన స్వాతంత్ర్యం రావాలి అంటే అవినీతి పోవాలి. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ వండర్ ఫుల్. రిస్క్ అయినా సినిమా తీశాం. బాగా వచ్చింది ఫ్యామిలీతో సినిమా చూడండి. ఇందులో నటించిన ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్ కు థాంక్స్. నన్ను దర్శకుడు రత్నబాబు బాగానే హ్యాండిల్ చేశాడు. విష్ణు నిర్మాతగా తీసిన ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.