Tollywood : సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వంతో.. వర్మ, చిరు, పవన్.. ఎవరు కరెక్ట్?

నిన్నటి మీటింగ్ లో మన టాలీవుడ్ స్టార్స్ అంతా జగన్ ని కలిసి సినీ పరిశ్రమని రక్షించమని, థియేటర్స్ ని రక్షించమని ప్రాధేయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి అయితే చేతులెత్తి దండం పెట్టి......

Tollywood :  సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వంతో.. వర్మ, చిరు, పవన్.. ఎవరు కరెక్ట్?

Tollywood

RGV vs Chiru vs Pawan :  సినిమా టికెట్ల విషయంలో, సినీ పరిశ్రమ కష్టాలపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముందుండి వీటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో ఏపీ సీఎం జగన్ ని, మంత్రి పేర్ని నానితో కలిసి సమస్యలని వివరించారు మెగాస్టార్. తాజాగా నిన్న మరోసారి చిరంజీవి తనతో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డిలను తీసుకువెళ్లి జగన్ తో మాట్లాడారు.

మాములుగా అయితే ప్రభుత్వంతో లోపల మీటింగ్ లో జరిగే చర్చలని బయటకి రిలీజ్ చేయరు. కానీ నిన్న మన స్టార్స్ జగన్, పేర్ని నానితో జరిగిన మీటింగ్ లో అందరూ మాట్లాడిన వీడియోస్ ని బయటకి రిలీజ్ చేశారు. ఆ వీడియోలు చూసిన వారంతా బాధపడుతూ కొత్త ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి కారణం నిన్న మీటింగ్ లో మెగాస్టార్, మన స్టార్స్ మాట్లాడిన విధానమే. వారు మాట్లాడిన విధానంతో గతంలో పవన్, వర్మ మాట్లాడిన వాటిని గుర్తు చేసుకుంటున్నారు.

 

నిన్నటి మీటింగ్ లో మన టాలీవుడ్ స్టార్స్ అంతా జగన్ ని కలిసి సినీ పరిశ్రమని రక్షించమని, థియేటర్స్ ని రక్షించమని ప్రాధేయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి అయితే చేతులెత్తి దండం పెట్టి సినిమా పరిశ్రమని కాపాడండి అని వేడుకున్నారు. చిరంజీవి చాలా నిదానంగా, ఒదిగి ఉండి సినీ సమస్యలని చెప్తూ వాటిని పరిష్కరించాలని బతిమాలుకున్నారు. చేతులెత్తి మొక్కి మరీ ప్రాధేయపడ్డారు అంటే ఎంత కిందకి దిగి మాట్లాడారో మనమే అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలు చూసిన వారంతా మెగాస్టార్ రేంజ్ కి ఆయన అలా ఒక నాయకుడి దగ్గర అడుక్కోవడం చూడటానికి చాలా కష్టంగా ఉందని అంటున్నారు. దీనిపై ఆర్జీవీతో పాటు చాలా మంది నెటిజన్లు కూడా మెగాస్టార్ అలా బెగ్గింగ్ చేయడమేంటని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి కిందకి తగ్గి మరీ సమస్యలు సాల్వ్ చేయమని ప్రాధేయపడ్డారు.

 

ఇక ఆర్జీవీ గతంలో ప్రభుత్వంతో ఈ సమస్యలపై ట్విట్టర్లోనే మాట్లాడేశారు. ఆర్జీవీ మాట్లాడినప్పుడు లాజిక్స్, లా పాయింట్స్ పట్టుకొని మాట్లాడాడు. సినిమా గురించి, ప్రజలకు వినోదం అనే కాన్సెప్ట్ గురించి అన్ని లా పాయింట్స్, చట్టాలు పట్టుకొని తెలివిగా మాట్లాడారు. ప్రభుత్వాన్ని సీరియస్ గా ప్రశ్నించకపోయినా చట్టబద్ధంగా మాట్లాడాడు ఆర్జీవీ. అయితే ఇది ఏపీ ప్రభుత్వానికి మింగుడుపడలేదు. పేర్ని నాని ఆర్జీవితో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇలాగే తన పాయింట్స్ అన్నిటిని చట్టబద్దంగా వివరించి మీరు చేస్తున్నది తప్పు అని ఏపీ ప్రభుత్వానికి తెలిపారు.

Tollywood : జగన్ తో మీటింగ్ కి పోసాని, ఆలీ ఎందుకు వెళ్లారు??

ఇక పవన్ కళ్యాణ్ గతంలో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా సమస్యలపై మాట్లాడారు. అప్పుడు చాలా ఆవేశంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడారు. ఇవన్నీ మన హక్కు అని, బతిమాలుకోవడం ఏంటని ప్రశ్నించాడు. డైరెక్ట్ గానే చిరంజీవిని ఆలా వెళ్లి బతిమాలొద్దు అని కూడా అన్నారు. సినీ సమస్యల విషయంలో పవన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, ఎదురించి మాట్లాడాడు. ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తి చూపాడు.

Tollywood : వర్మ vs మెగా.. ఏపీ ప్రభుత్వంతో ఎవరు ఎలా మాట్లాడారు?

అయితే ఇప్పుడు వీరు ముగ్గురు సినిమా సమస్యలపై ఒక్కో రకంగా మాట్లాడటంతో పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకుల్లో సందిగ్దత ఏర్పడింది. చిరంజీవి నిన్న లా ప్రాధేయపడటంతో వీళ్ళలో ఎవరు కరెక్ట్ అంటూ ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం సైడ్ నుంచి తప్పు ఉంది కాబట్టి పవన్ కరెక్ట్ అంటున్నారు కొంతమంది. చట్టబద్దంగా ఎదుర్కోవాలి కాబట్టి ఆర్జీవీనే కరెక్ట్ అంటున్నారు కొంతమంది. ఇక ప్రభుత్వమే కక్ష కట్టి సమస్యలని సృష్టించింది కాబట్టి మెగాస్టార్ లాగా బతిమాలుకోవాల్సిందే లేకపోతే పరిష్కారం దొరకదు అని కొంతమంది చిరంజీవే కరెక్ట్ అంటున్నారు.

Tollywood Meeting : సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం చివరి సమావేశం.. మెగా మీటింగ్ ఫలించిందా??

ఇలా పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి విధానం నచ్చింది. ఒక్కొక్కరు ఒక్కోక్కరికి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి ఏది నచ్చినా, ఎవరు ఎలా మాట్లాడినా, ఎవరు ఎవరికి సపోర్ట్ చేసినా ప్రభుత్వానికి నచ్చిందే చేస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలి అనుకుంటే అదే చేస్తుంది. అది మంచి అయినా, చెడు అయినా. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కొంతమందికి కరెక్ట్ అనిపించొచ్చు, కొంతమందికి తప్పు అనిపించొచ్చు. ఏది ఏమైనా చివరకి ఈ సమస్య పరిష్కారం అయితే చాలు అని అటు సినీ పరిశ్రమ వర్గాలు, ఇటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.