Shreyas Media : సినిమాలు, ఆర్టిస్టులే కాదు ఈవెంట్స్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ..
తెలుగులో అతిపెద్ద సినిమా ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఏ సినిమా ఈవెంట్ చిన్నదైనా, పెద్దదైనా జరగాలంటే శ్రేయాస్ మీడియా ఉండాల్సిందే.

Movie Event Organizer Shreyas Media entry into Bollywood
Shreyas Media : ఒకప్పుడు ఇండియన్ సినిమా(Cinema) అంటే బాలీవుడ్(Bollywood) అన్నట్టే చూపించారు. సౌత్(South) సినిమాలను అస్సలు పట్టించుకోలేదు. కానీ గత రెండేళ్లుగా ఇండియన్ సినిమా ముఖచిత్రం మారిపోయింది. సౌత్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎదిగింది. ముఖ్యంగా మన తెలుగు(Telugu) సినిమా ఆస్కార్(Oscar) తెచ్చింది. దీంతో బాలీవుడ్ వాళ్ళు మన సినిమాలని తీసుకొని రీమేక్స్ చేసుకుంటున్నారు. మన ఆర్టిస్టులని బాలీవుడ్ సినిమాల్లో పెట్టుకుంటున్నారు. బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాతో నింపేస్తున్నారు.
గత కొన్నాళ్లుగా తెలుగు ఆర్టిస్టులకు, డైరెక్టర్స్ కు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. మన సూపర్ హిట్ సినిమాలని వాళ్ళు రీమేక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సినిమా ఈవెంట్స్ ని కూడా సౌత్ వాళ్ళతోనే నిర్వహించేలా చేయబోతున్నారు. తెలుగులో అతిపెద్ద సినిమా ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఏ సినిమా ఈవెంట్ చిన్నదైనా, పెద్దదైనా జరగాలంటే శ్రేయాస్ మీడియా ఉండాల్సిందే.
కొన్ని వందల తెలుగు సినిమాలకు టీజర్, ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇలా సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా శ్రేయాస్ మీడియానే నిర్వహిస్తుంది. తెలుగు సినిమాల ఈవెంట్స్ ని వేరే రాష్ట్రాల్లో కూడా గతంలో నిర్వహించింది. ఇక బయటి సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వాలంటే శ్రేయాస్ మీడియా ద్వారానే ఈవెంట్ జరిగేది. ఇప్పుడు శ్రేయాస్ మీడియా కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇండియాస్ నెంబర్ 1 మూవీ ఈవెంట్స్ & ప్రమోషనల్ కంపెనీ అంటూ ప్రమోట్ చేసుకుంటుంది శ్రేయాస్ మీడియా. ఇప్పటికే సౌత్ లో చాలా వరకు సినిమా ఈవెంట్స్ అంటే శ్రేయాస్ మీడియానే చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇవ్వడంతోనే బాలీవుడ్ ప్రముఖులతో ప్రమోషన్స్ కూడా చేపించుకుంటుంది.
ఇప్పుడు ఎలాగో తెలుగు వాళ్ళు బాలీవుడ్ లో చాలా మంది సినిమాలు చేస్తున్నారు కాబట్టి శ్రేయాస్ మీడియాకు బాలీవుడ్ లో ఈవెంట్స్ దక్కడం ఈజీ అవుతుందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు సినిమాలతో బాలీవుడ్ ని రూల్ చేసిన టాలీవుడ్, ఇప్పుడు ఈవెంట్స్ తో కూడా రూల్ చేయబోతుంది. మరి శ్రేయాస్ మీడియా బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఈవెంట్స్ నిర్వహిస్తుందో చూడాలి.
SHREYAS GROUP VENTURES INTO BOLLYWOOD… #ShreyasGroup – a leading name in movie events and promotions in #SouthIndia – is all set to land its big footprint in #Bollywood.
Stay excited for what they’re bringing!@shreyasmedia pic.twitter.com/SCdeifuUXZ
— taran adarsh (@taran_adarsh) April 15, 2023