Jio Cinema : జియో సినిమా సూపర్ ప్లాన్.. IPL ఫ్రీనే కానీ సినిమా కంటెంట్‌కు మాత్రం డబ్బులు కట్టాల్సిందే..

ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్.. లాగే జియో సినిమాని కూడా ప్రముఖ ఓటీటీగా మార్చాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 100 కంటెంట్స్ ని జియో సినిమాలోకి తీసుకురానున్నారు.

Jio Cinema : జియో సినిమా సూపర్ ప్లాన్.. IPL ఫ్రీనే కానీ సినిమా కంటెంట్‌కు మాత్రం డబ్బులు కట్టాల్సిందే..

Jio Cinema collect money for Cinema content in Future

Jio Cinema :  గత కొన్ని రోజులుగా IPL మొదలైన దగ్గర్నుంచి జియో సినిమా(Jio Cinema) పేరు బాగా వినిపిస్తుంది. అంతకుముందు అసలు జియో సినిమా యాప్ ఉన్న సంగతి ఎక్కువ మందికి తెలీదు. రిలియన్స్ కు చెందిన వయాకామ్ 18(Viacom 18) సంస్థ ఈ సారి IPL డిజిటల్ హక్కులని ప్రసారం చేసేందుకు బిడ్ గెలిచింది. ఐదు సంవత్సరాలకు గాను వయాకామ్ సంస్థ IPL డిజిటల్ ప్రసారాలు చేయనుంది. దీంతో ఇండియాలోని క్రికెట్(Cricjet) అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. జియో సినిమా యాప్ ద్వారా IPL మ్యాచ్ లను ఉచితంగా ప్రసారం చేయనున్నట్టు తెలియచేసింది.

దీంతో ఎన్నడూ లేని విధంగా జియో సినిమా యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఉచితంగా ప్రసారాలు ఇవ్వడంతో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాక కేవలం జియో సిమ్ ఉన్నవాళ్లకు మాత్రమే కాకుండా అందరికి ఉచితంగా చూపిస్తుండటంతో జియో సినిమా కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయింది. తాజాగా జియో స్టూడియోస్ ఓ ఈవెంట్ నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో దాదాపు 100 సినిమాలు, సిరీస్ లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, అవి జియో సినిమాలో విడుదల అవుతాయని ప్రకటించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్.. లాగే జియో సినిమాని కూడా ప్రముఖ ఓటీటీగా మార్చాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 100 కంటెంట్స్ ని జియో సినిమాలోకి తీసుకురానున్నారు. కొన్ని థియేట్రికల్ రిలీజ్ అయ్యాక, మరికొన్ని డైరెక్ట్ జియో సినిమా యాప్ లోకి త్వరలో రానున్నాయి. ఈ విషయాన్ని రిలియన్స్ మీడియా, కంటెంట్ హెడ్ జ్యోతి దేశ్ పాండే తెలిపారు. అయితే ఈ కంటెంట్ కి డబ్బులు వసూలు చేయనున్నట్టు కూడా తెలిపారు.

Singer Mano : ప్రముఖ అమెరికా యూనివర్సిటీ నుంచి సింగర్ మనోకు డాక్టరేట్..

మిగిలిన ఓటీటీల్లాగే నెలకు, సంవత్సరానికి ఫీజు వసూలు చేయనుంది జియో సినిమా. కేవలం సినిమా కంటెంట్ కు మాత్రమే డబ్బులు వసూలు చేస్తామని, IPL మాత్రం ఫ్రీగానే టెలికాస్ట్ చేస్తామని ప్రకటించారు. IPL హక్కులు ఉన్న అయిదేళ్ల కాలంలో జియో సినిమాని మరింత విస్తరించి IPL సాయంతో సినిమా కంటెంట్ ని కూడా ప్రమోట్ చేసి ప్రముఖ ఓటీటీగా మార్చాలనుకుంటున్నారు. ఇప్పటికే సొంతంగా కొన్ని సినిమాలు నిర్మించడం, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థల నుంచి కంటెంట్ కి సంబంధించిన ఉద్యోగులను తీసుకోవడం కూడా చేస్తుంది జియో స్టూడియోస్. మరి భవిష్యత్తులో జియో సినిమా మరో పెద్ద ఓటీటీగా అవతరిస్తుందేమో చూడాలి.