AP : తెనాలిలో సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్

తెనాలిలోని సీమాంధ్ర ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు కొత్త సినిమాలకు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి లభించిం

AP : తెనాలిలో సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్

Film

Movie Title Registration : ఏదైనా సినిమా మొదలు పెట్టేముందు టైటిల్ ను ఫిక్స్ చేసుకుంటుంటారు. అయితే..ఈ టైటిల్ ను ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యలు వస్తాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో టైటిల్ రిజిస్టర్ చేసుకొనేందుకు సంస్థలు ఉంటాయి. దీనికి కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తాజాగా…ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలోని సీమాంధ్ర ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు కొత్త సినిమాలకు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి లభించింది.

Read More : MAA Elections 2021 : ‘మీ ఇష్టం’.. బండ్ల వెరైటీ ప్రచారం..

ఈ విషయాన్ని సీమాంధ్ర ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. స్థానిక చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కల్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ ఆమోదంతో సినిమాలకు టైటిల్స్, బ్యానర్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ, క్లియరెన్స్ లు, లాబ్ లెటర్లు, డ్యూరేషన్ సర్టిఫికేట్లను జారీ చేసే అవకాశం తమ సంస్థకు లభించిందని తెలిపారు. తాము ఆమోదించే టైటిల్స్ కు కేంద్ర సెన్సార్ కార్యాలయం అనుమతి ఇస్తుందన్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి కార్యకలపాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు.