Mrunal Thakur: ‘సీతారామం’తో సాలిడ్ సక్సెస్.. అయినా పాపం..!

అందాల భామ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దగా, ఈ సినిమాలో మృణాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమా ఇచ్చిన సాలిడ్ సక్సెస్‌తో అమ్మడికి వరుసబెట్టి ఆఫర్లు వస్తాయని అందరూ ఆశించారు.

Mrunal Thakur: ‘సీతారామం’తో సాలిడ్ సక్సెస్.. అయినా పాపం..!

Mrunal Thakur Waited For Star Heroes After Sita Ramam Success

Updated On : February 1, 2023 / 8:37 PM IST

Mrunal Thakur: అందాల భామ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దగా, ఈ సినిమాలో మృణాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమా ఇచ్చిన సాలిడ్ సక్సెస్‌తో అమ్మడికి వరుసబెట్టి ఆఫర్లు వస్తాయని అందరూ ఆశించారు.

Mrunal Thakur : పూల డ్రెస్‌లో పరిమళిస్తున్న మృణాల్ ఠాకూర్..

అయితే, సీతారామం సక్సెస్ తరువాత మృణాల తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేందుకు చాలా సమయమే పట్టిందని చెప్పాలి. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సీతారామం గ్రాండ్ విక్టరీ తరువాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూసిందట ఈ బ్యూటీ. అయితే, ఆమెను కన్సిడర్ చేసినా కూడా కొన్ని కారణాల వల్ల ఆమెను ఫైనల్ చేయలేదట. అలా మృణాల్ చాలా మంది స్టార్ హీరోల సినిమాల కోసం వెయిట్ చేస్తూ వచ్చింది.

Mrunal Thakur : అటు మోడ్రన్.. ఇటు ట్రెడిషినల్.. క్యూట్ లుక్స్‌తో మృణాల్..

కానీ, అవేమీ వర్కవుట్ కాకపోవడంతో.. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సరసన నటించేందుకు ఓకే చెప్పేసింది ఈ బ్యూటీ. నాని కెరీర్‌లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ కావడంతో ఈ సినిమాలో మృణాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా.. నానితో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.