‘Audi Chaiwala’ : ఆడి కారులో వచ్చి వేడి వేడి టీ, కాఫీలు అమ్ముతున్న కుర్రాళ్లు

బెంజ్ కారులో వచ్చి బెండకాయలు,బీరకాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? ఆడి కారులో వచ్చి ఆనపకాయలు అమ్మితే ఎలా ఉంటుంది? ఇవి ఎలా ఉన్నాగానీ..ఆడి కారులో వచ్చి టీ అమ్మితే ఇదిగో వీరిలా ఉంటుంది..

‘Audi Chaiwala’ : ఆడి కారులో వచ్చి వేడి వేడి టీ, కాఫీలు అమ్ముతున్న కుర్రాళ్లు

Mumbai ‘Audi Chaiwala’

Mumbai ‘Audi Chaiwala’ : బెంజ్ కారులో వచ్చి బెండకాయలు,బీరకాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? ఆడి కారులో వచ్చి ఆనపకాయలు అమ్మితే ఎలా ఉంటుంది? చూసేవారికి కాస్త వింతగా..ఈ రేంజ్ లో ఉండి ఇలాంటి వ్యాపారాలేంటిరా బాబూ అంటు కాస్త ఆసక్తిగా చూస్తారు జనాలు. కానీ చూసేవారు ఏమనుకుంటే మనకేంటీ?..చేతికి అదనపు ఆదాయం వస్తోందా? లేదా? అని అనుకుంటున్నారు కొంతమంది యువత. వినూత్నంగా ఆలోచిస్తు పార్ట్ టైమ్ జాబ్ లాగా కొంతమంది యువత అదనపు ఆదాయం దిశగా ఆలోచిస్తున్నారు.

తామేంటీ తమ రేంజ్ ఏంటీ అని ఆలోచించకుండా టీ,కాఫీలు అమ్మటానికి కూడా వెనుకాడటంలేదు. ముంబైలో ఇద్దరు యువకుల్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఇద్దరు కుర్రాళ్లు దర్జాగా ఆడి కారలో వస్తారు.డిక్కి ఓపెన్ చేసిన దాంట్లో ఉన్న సరంజామా బయటకు తీసి చకచకా వేడి వేడిగా టీ,కాఫీలు అమ్ముతారు. తరువాత చక్కగా ఆడికారు దుకాణం మూసి దర్జాగా అదే ఆడీ కారులో వెళ్లిపోతారు.

Chai GPT : వావ్ ‘చాయ్ జీపీటీ’.. నీ ట్రెండ్ మామూలుగా లేదు భయ్యా

ముంబైలోని లోఖండ్ వాలా బ్యాక్ రోడ్డులో పక్కనే ఆడి కారు, డిక్కీలో సామాను. దానిపక్కనే వేడి వేడి ఛాయ్ రెడీ చేస్తుండడం కనిపిస్తుంది. ఛాయ్ అమ్మడం అయిపోయిన తర్వాత ఎంచక్కా ఆడి కారులో తిరిగి వెళ్లిపోతారు. అమిత్ కాశ్యప్, మను శర్మ అనే ఇద్దరు యువకులు చేసే ఈ పని ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ‘ఆడి చాయ్ వాలా’పేరొందారు వీరిద్దరు. వీరి స్టాల్ కు ‘రఓడీ టీ’అని పేరు పెట్టుకున్నారు.

 

వీరిద్దరికి డబ్బుల్లేక కాదు. డబ్బులు లేకపోతే ఆడికారు ఎందుకు వేసుకొస్తారు? పార్ట్ టైమ్ ఆదాయం కోసమే వీరు టీ షాప్ ఎంపిక చేసుకున్నారు. ఈ స్టాల్ ను అమిత్ కాశ్యప్, మను శర్మ కలసి ఏర్పాటు చేశారు. వీళ్లను చూసి కొంతమంది ఆశ్చర్యపోతుంటే మరికొంతమంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆడి కారు ఉన్నా ఛాయ్ అమ్మడం ఏంటీ అని కొంతమంది ఆశ్చర్యచూస్తారు. మరికొంతమంది డబ్బున్నోళ్లు గరీబోళ్ల మాదిరిగా ఈ ఛాయ్ అమ్మడం ఏంటీ అని మరికొందరు..

ఈరోజుల్లో చాలామంది కుర్రాల్లు ఓ మంచి ఉద్యోగం వచ్చింది కదాని ఆరామ్ గా ఉండటంలేదు. వీలైతే కాదు వీలు చేసుకుని రెండు మూడు ఉద్యోగాలు చేయటానికి కూడా వెనుకాడటంలేదు. అలా వీలుకాకపోతే సైడ్ బిజినెస్ గా మరో ఆదాయ మార్గం ద్వారా కూడా డబ్బులు సంపాదించేస్తున్నారు. ఆ మధ్య లాక్ డౌస్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా రెండు మూడు కంపెనీల్లో ఉద్యోగాలు చేసిన రెండు చేతులా కాదు ఏకంగా నాలుగు ఆరు చేతులతో సంపాదించేశారు. మరికొంతమంది సైడ్ బిజినెస్ గా ఇము కోళ్ల ఫామ్ లు, పండ్లు, కూరగాయల పెంపకం వంటివి చేసి చక్కటి ఆదాయాలను పొందారు. ఈ ముంబై కుర్రాల్ల స్టైల్ వేరే అయినా అదనపు ఆదాయమే కామన్ పాయింట్ గా ఉంది.