Mumbai : ప్రాణాలతో చెలగాటం.. డోర్ పట్టుకు వేలాడుతూ లోకల్ ట్రైన్‌లో ఓ యువకుడి ఫీట్.. ఆందోళన చెందిన నెటిజన్లు

ముంబయి లోకల్ ట్రైన్లు ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటాయి. త్వరగా గమ్యస్ధానానికి చేరాలని కొందరు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ట్రైన్ డోర్ పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు చేసిన ఫీట్ భయం కలిగించింది.

Mumbai : ప్రాణాలతో చెలగాటం.. డోర్ పట్టుకు వేలాడుతూ లోకల్ ట్రైన్‌లో ఓ యువకుడి ఫీట్.. ఆందోళన చెందిన నెటిజన్లు

Mumbai

Updated On : June 30, 2023 / 6:19 PM IST

Mumbai : మెట్రోలు, లోకల్ ట్రైన్లు ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటాయి. ఇంట్లో బయలుదేరడం కొంచెం ఆలస్యం అవ్వడం వల్లో, లేక గమ్యస్ధానానికి త్వరగా చేరాలనే తొందరలో కొందరు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చుకునే ఫీట్లు చేస్తున్నారు. రీసెంట్‌గా కదులుతున్న ముంబయి లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం చూసి నెటిజన్లు ఆందోళన పడ్డారు. ఇలాంటి ఫీట్లు చేయకండని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Mumbai : బోరివాలి టూ అంథేరి.. డెయిలీ ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న డాగ్

ముంబయి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. లోకల్ ట్రైన్ క్రిక్కిరిసిపోయి ఉంది. అయినా ట్రైన్ ఎక్కడానికి జనం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో డోర్ పట్టుకుని వేలాడుతూ అత్యంత ప్రమాదకరమైన ఫీట్ చేసాడు. చూసేవారికి ఏ క్షణం ఏమవుతుందో అన్న భయాన్ని కలిగించిన ఈ వీడియో viralbhayani అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ట్రైన్ నెక్ట్స్ స్టేషన్‌కు వెళ్లేవరకూ ఆ వ్యక్తి ఇదే పరిస్థితుల్లో ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల భద్రత గురించి ఆందోళన చెందుతూ ఈ వీడియోకి నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

Couple Kissing : హవ్వ.. లోకల్ ట్రైన్‌లో రెచ్చిపోయిన ప్రేమజంట, పబ్లిక్‌గా లిప్‌లాక్

‘ఇది చాలా ప్రమాదకరం.. ప్రతి చోటా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి’ అని ఒకరు.. ‘సాధారణ ప్రజలు జీవనోపాధి కోసం రోజు చేసే పోరాటం ఇది.. ఎందుకంటే క్యాబ్ లేదా కారులో వెళ్లడానికి ఆర్ధిక పరిస్థితులు సహకరించవు’ అని మరొకరు కామెంట్లు పెట్టారు. ఈ వీడియో రైల్వే అధికారుల వరకూ చేరే ఉంటుంది. ఈ ఫీట్ చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు చేపడతారో.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారో? వేచి చూడాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)