Naga Chaitanya: చైతూ ట్వీట్.. జుట్టు పీక్కున్న నెటిజన్లు!

అక్కినేని స్వీట్ కపుల్ నాగ చైతన్య -సమంతా విడిపోయాక ఎవరికి వారే ఆ బాధ నుండి బయటపడుతూ బిజీ అయిపోయారు. ఇందులో సామ్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా వరసపెట్టి పోస్టులు, స్టోరీలు..

Naga Chaitanya: చైతూ ట్వీట్.. జుట్టు పీక్కున్న నెటిజన్లు!

Naga Chaitanya

Updated On : November 14, 2021 / 9:21 PM IST

Naga Chaitanya: అక్కినేని స్వీట్ కపుల్ నాగ చైతన్య -సమంతా విడిపోయాక ఎవరికి వారే ఆ బాధ నుండి బయటపడుతూ బిజీ అయిపోయారు. ఇందులో సామ్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా వరసపెట్టి పోస్టులు, స్టోరీలు, కోట్స్ పెడుతుంటే చైతూ మాత్రం ఏ అమావాస్యకో ఒకసారి తళుక్కున మెరిసి ఏ సినిమా గురించో లేక మరింకేదైనా తనకి ఇష్టమైన దాని గురించి సరదాగా చెప్పేసి అలా అలా వెళ్ళిపోతున్నాడు.

Akhanda: లెఫ్టా రైటా.. కొడకా ఇంచు బాడీ దొరకదు.. అఖండ ట్రైలర్ రివ్యూ!

ఇప్పుడు కూడా చైతూ అలానే #GrazieVale అని ట్వీట్ చేశాడు. దీంతో అసలు ఇది దేని గురించా అని నెటిజన్లు జుట్లు పీక్కున్నారు. ఇలాంటి సమయంలో చైతూ ఏదైతే ట్వీట్ చేశాడంటే అదేంటా అని కోట్ల కళ్ళు విప్పార్చి మరీ చూస్తుంటాయి. ఈ ట్వీట్ ను కూడా అలానే దేని గురించా అని తెగ వెతికేశారు. అయితే తీరిగ్గా ఇది ఓ రేసర్ గురించి అని తెలుసుకొని ఉసూరుమన్నారు.

Disha Patani: ఉవ్వెత్తున ఎగిసిపడే దిశ నాజూకు అందాలు!

చైతూ ట్వీట్ చేసిన #GrazieVale పేరు ఓ ఫేమస్ రేసర్. అతను ఈ రోజు చివరి రైడ్ చేసి వీడ్కోలు తీసుకున్నాడట. అందుకే ఆయన గురించి మన నాగ చైతన్య ట్వీట్ వేశాడు. నాగ చైతన్య కూడా ఓ రేసర్ అన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యకు కార్లు, బైకులు నడపడం అంటే చాలా ఇష్టం. ప్రొఫెషనల్ రేసర్ అయిన నాగ చైతన్య ప్రపంచంలో ఎక్కడా రేసింగ్స్ జరిగినా వాటిని వాచ్ చేస్తూ ఉంటాడు. అలా తనకి ఇష్టమైన ఒక రేసర్ ఫైనల్ రేస్ పూర్తిచేసుకొని వీడ్కోలు పలకడంతో చైతూ ఇలా వీడ్కోలు చెప్పాడన్నమాట.