Akhanda: లెఫ్టా రైటా.. కొడకా ఇంచు బాడీ దొరకదు.. అఖండ ట్రైలర్ రివ్యూ!

నటసింహం బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ గర్జన మొదలైంది. ముందుగా ఈ ఆదివారం ట్రైలర్ తో వేట మొదలు పెట్టారు. అనుకున్నట్లే..

Akhanda: లెఫ్టా రైటా.. కొడకా ఇంచు బాడీ దొరకదు.. అఖండ ట్రైలర్ రివ్యూ!

Akhanda

Akhanda: నటసింహం బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ గర్జన మొదలైంది. ముందుగా ఈ ఆదివారం ట్రైలర్ తో వేట మొదలు పెట్టారు. అనుకున్నట్లే ఆదివారం సాయంత్రం 7.09 నిమిషాలకి అఖండ ట్రైలర్ విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఎటు చూసినా అఖండ ట్రైలర్ తో నందమూరి అభిమానులు సందడి చేస్తున్నారు.

Akhanda Trailer : అరాచకం.. నటసింహా నట విశ్వరూపం..

ఇక, ట్రైలర్ విషయానికి వస్తే.. ఇప్పటికే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ సినిమాలలో ఉగ్రరూపంతో కూడిన నటవిశ్వరూపాన్ని చూపించారు. ఇక, ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో సినిమాలో అంటే అంచనాలు ఆకాశామే హద్దుగా ఉంటాయి. దానికి తగ్గట్లుగా బోయపాటి సరుకు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే వదిలిన టీజర్, పోస్టర్లు గత రెండు సినిమాలను మించే ఈ సినిమాలో ఏదో ఉంటుందని అనిపించాడు. ఇక ఇప్పుడు ట్రైలర్ తో నో డౌట్ అఖండ ఈ కాంబినేషన్ కు బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ అని ఫిక్సయిపోతున్నారు.

Jr NTR: తారక్ రెండు నెలల విరామం వెనుక అసలు నిజమేంటి?

విధికి విధాతకి విశ్వాసానికి సవాళ్లు విసరకూడదు అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది బాలయ్య ఉగ్రరూపం.. అందుకు తగ్గ డైలాగ్స్. అంచనా వేయడానికి నువ్వు పోలవరం డ్యామా, పట్టి సీమ తూమా.. పిల్ల కాలువ` అంటూ అవతలి వ్యక్తిని కంపేర్ చేస్తూ చెప్పిన డైలాగ్.. ఒక మాట నువ్వు అంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం’, ‘ఒకసారి డిసైడై బరిలో దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ ని.. తొక్కి పారదొబ్బతా’ లెఫ్టా రైటా టాపా బాటమా.. కొడకా ఇంచు బాడీ దొరకదు’ ఇలా బాలయ్య మేనరిజం డైలాగ్స్ కు ఈ సినిమాలో కొదువేలేదని పక్కా చెప్పొచ్చు.

Keerthy Suresh: బ్యూటీ విత్ టాలెంట్ మహానటి!

ఇక, ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలో నటిస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేయగా.. అఘోరా పాత్ర అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులు ఏదేదో ఊహించుకున్నారు. కానీ.. ట్రైలర్ ని బట్టి చూస్తే అఘోరా పాత్రకి కూడా ‘నీకు సమస్య వస్తే దండం పెడతారు. మేము ఆ సమస్యకే పిండం పెడతాం.. బోత్ ఆర్ సేమ్’ అంటూ డైలాగ్స్ విషయంలో ఎక్కడా తగ్గించలేదు. ఇక హీరోయిన్ ప్రగ్యాను జస్ట్ సెకన్ల పాటే చూపించి వదిలేయగా.. ఇందులో రొమాన్స్ కన్నా.. పక్కా యాక్షన్.. బాలయ్య ఉరగారూపాన్నే హైలెట్ చేయనున్నారని అర్ధం చేసుకోవచ్చు.

Prabhas: రెబల్‌ స్టార్ పాన్‌ వరల్డ్ సినిమా.. కొరియన్ భామతో రొమాన్స్!

ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ కు తోడు.. జగపతి బాబు, శ్రీకాంత్ కూడా తోడయ్యారు. జగపతిబాబు గతంలో స్టైలిష్ విలన్ గా కూడా క్రూరంగా చూపించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు రగ్గ్ డ్ మాస్ గెటప్ లో చూపించింది. ఇక శ్రీకాంత్ ఊరమస్ గెటప్ లో చెప్పే డైలాగ్స్ వింటే ఇందులో తనది క్రూరంగా ఉండబోతుందని సింపుల్ గా చెప్పేయొచ్చు. మొత్తం ట్రైలర్ పవర్ ఫుల్ డైలాగులతో దద్దరిల్లేలా డిజైన్ చేశారు. బాలయ్య-బోయపాటి అనగానే ఏదైతే అంచనా వేస్తారో దాంతోనే ట్రైలర్ నింపేశారు. మరి సినిమా ఇక ఏ స్థాయిలో హై ఓల్టేజ్ లో తెరకెక్కించారో చూడాలి. అన్నట్లు ఇంకా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించలేదు కానీ డిసెంబర్ 2న రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.