Akhanda Mass Jathara : బాక్సాఫీస్ బరిలో బాలయ్య మాస్ ర్యాంపేజ్!

‘అఖండ’ తో కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతూ నాలుగవ వారంలోనూ రచ్చ రంబోలా చేస్తున్నారు బాలయ్య..

Akhanda Mass Jathara : బాక్సాఫీస్ బరిలో బాలయ్య మాస్ ర్యాంపేజ్!

Akhanda Mass Jathara

Updated On : December 26, 2021 / 12:12 PM IST

Akhanda Mass Jathara: సరైన సాలిడ్ మాస్ బొమ్మ పడితే థియేటర్లు జాతరను తలపిస్తాయి.. ప్రేక్షకులు హాళ్లవైపు పోటెత్తుతారు అని మరోసారి నిరూపించారు నటసింహా నందమూరి బాలకృష్ణ. డిసెంబర్ 2 నుండి అసలు సిసలు మాస్ జాతరను తెలుగు ప్రేక్షకులకు చూపిస్తున్నారాయన.

Anil Ravipudi : ఏపీ థియేటర్స్ విషయంలో అయోమయంగా ఉంది..

ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’ చేసి.. కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతూ నాలుగవ వారంలోనూ రచ్చ రంబోలా చేస్తున్నారు బాలయ్య. డిసెంబర్ 26 నాటికి ‘అఖండ’ విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంటోంది. క్రిస్మస్ రోజు దాదాపు అన్ని ఏరియాల్లోనూ హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.

Saamanyudu : తలరాతను మార్చి రాసే ‘సామాన్యుడు’..

బాలయ్య కెరీర్‌లో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాగా ‘అఖండ’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్‌వైడ్ రూ.125 కోట్ల గ్రాస్ రాబట్టింది. పాండమిక్ తర్వాత బాక్సాఫీస్ బరిలో మాస్ సినిమా సత్తా ఏంటనేది చూపించింది. కరోనా మొదలైనప్పటినుండి ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినాను తెలియజెప్పిన స్టార్ హీరో సినిమా ‘అఖండ’ కావడం విశేషం.

Salute Movie : దుల్కర్ డిఫరెంట్ థ్రిల్లర్ ‘సెల్యూట్’..