Saamanyudu : తలరాతను మార్చి రాసే ‘సామాన్యుడు’..

విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’ (Not A Common Man) టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది..

Saamanyudu : తలరాతను మార్చి రాసే ‘సామాన్యుడు’..

Saamanyudu

Updated On : December 25, 2021 / 5:44 PM IST

Saamanyudu: తను నటించే ప్రతి సినిమాలోనూ కొత్తదనం, చేసే క్యారెక్టర్‌లో వైవిధ్యం చూపించాలని కోరుకునే నటుడు విశాల్. కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ వత్యాసం చూపిస్తూ హీరోగా తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రత్యేకమైన గుర్తింపు, మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు.

Singer Revanth : గ్రాండ్‌గా సింగర్ రేవంత్ ఎంగేజ్‌మెంట్..

విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’.(Not A Common Man).. డింపుల్ హయతి కథానాయిక. యోగిబాబు కీలకపాత్రలో కనిపించనున్నాడు. సొంత బ్యానర్‌ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ నిర్మిస్తున్నాడు. శరవణన్ డైరెక్ట్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ‘సామాన్యుడు’ టీజర్ రిలీజ్ చేశారు.

Saamanyudu Movie

 

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా మీద అంచనాలు పెంచింది. ‘ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు, జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరు, ఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, అధికారం కోసం అంతం చెయ్యాలనుకునే రాక్షసులు.. ఆ రాక్షసుల తలరాతను మార్చి రాయాల్సిన పరిస్థితి.. ఒకరోజు ఓ సామాన్యుడికి వస్తుంది’.. అనే డైలాగుతో సినిమా కథ ఏంటనేది క్లుప్తంగా చెప్పారు.

RRR Movie : మళ్లీ వాయిదా?

యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్, కవిన్ రాజ్ విజువల్స్ బాగున్నాయి. సాధారణంగా విశాల్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మూవీలోనూ ఫైట్స్‌కి పెద్ద పీట వేశారు. యాక్షన్ సీన్స్ షూట్ చేసేటప్పుడు విశాల్ గాయపడ్డ సంగతి తెలిసిందే. త్వరలో ‘సామాన్యుడు’ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు.