Balakrishna : తారక్ తగ్గాడు.. బాలయ్య ‘అఖండ’ అక్టోబర్‌లోనే..

లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి..

Balakrishna : తారక్ తగ్గాడు.. బాలయ్య ‘అఖండ’ అక్టోబర్‌లోనే..

Balakrishna

Balakrishna: లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి. దసరా, దీపావళి, క్రిస్మస్, వచ్చే సంక్రాంతి వంటి పండుగ సీజన్లలో పెద్ద సినిమాల మధ్య పోటీ తప్పేలా లేదు. 2022 సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ (జనవరి 12), ‘సర్కారు వారి పాట’ (జనవర 13), ‘రాధే శ్యామ్’ (జనవరి 14) రిలీజ్ డేట్స్ లాక్ చేసేసుకున్నాయి. ‘సలార్’, ‘హరి హర వీర మల్లు’ కూడా సంక్రాంతికే అన్నారు కానీ విడుదల తేదీల విషయంలో క్లారిటీ లేదు.

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

ఇదిలా ఉంటే అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్న డేట్ నుండి వెనక్కి వెళ్లడంతో.. బాబాయ్ బాలయ్య ‘అఖండ’ అక్టోబర్‌లో రిలీజ్ కానుందనే వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ అని అనౌన్స్ చేశారు.

RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..

ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న టైంకి కంప్లీట్ అయ్యేలా లేదు. దీంతో అక్టోబర్ 13కి ‘ఆర్ఆర్ఆర్’ రాకపోవచ్చు అంటున్నారు. ఇక ‘అఖండ’ షూటింగ్ కూడా క్లైమాక్స్ స్టేజ్‌కి వచ్చేసింది. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నాడు (మే 28)న విడుదల అనుకున్నారు కానీ పాండమిక్ వల్ల వీలుపడలేదు.

Balakrishna : ‘అఖండ’ ఆన్ ది వే..

ఇప్పుడు షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చెయ్యడంతో వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యాలనే ప్లాన్‌లో ఉన్నారట ‘అఖండ’ మేకర్స్. సెప్టెంబర్ రిలీజ్ అని వార్తలు వచ్చాయి కానీ పెండింగ్ వర్క్ చాలా ఉంది. దీంతో అక్టోబర్‌కి షిఫ్ట్ అయ్యారు ‘అఖండ’ టీం. అక్టోబర్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ రోర్ పేరుతో వదిలిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసింది.

RRR : అంచ‌నాలు పెంచేలా.. అదిరిపోయే ప్లాన్ చేసిన జక్కన్న..