Balakrishna: గాలా విత్ బాలా.. బాలయ్య మేకోవర్ చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ ఫాంలో ఉన్న సీనియర్ హీరో అని చెప్పాలి. ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుండటం.. అటు బుల్లితెర ప్రేక్షకులను సైతం తన అన్‌స్టాపబుల్ టాక్ షోతో ఉర్రూతలూగించిన ఘనత బాలయ్య సొంతం. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ టాక్ షో బాలయ్యకు మరింత ఫాలోయింగ్‌ను క్రియేట్ అయ్యేలా చేసింది. ఇక ఆయన నటించిన రీసెంట్ మూవీ వీరసింహారెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో అభిమానులు ఆయన నెక్ట్స్ చిత్రాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

Balakrishna: గాలా విత్ బాలా.. బాలయ్య మేకోవర్ చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!

Nandamuri Balakrishna New Look Goes Viral

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ ఫాంలో ఉన్న సీనియర్ హీరో అని చెప్పాలి. ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుండటం.. అటు బుల్లితెర ప్రేక్షకులను సైతం తన అన్‌స్టాపబుల్ టాక్ షోతో ఉర్రూతలూగించిన ఘనత బాలయ్య సొంతం. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ టాక్ షో బాలయ్యకు మరింత ఫాలోయింగ్‌ను క్రియేట్ అయ్యేలా చేసింది. ఇక ఆయన నటించిన రీసెంట్ మూవీ వీరసింహారెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో అభిమానులు ఆయన నెక్ట్స్ చిత్రాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

Balakrishna : ఆహా వేదిక పై మరోసారి బాలయ్య హోస్టింగ్.. కానీ అన్‌స్టాపబుల్‌కి కాదు!

ఇదిలా ఉండగా, బాలయ్య తన అభిమానులకు ఏదో ఒక ప్రత్యేకతను బహుమతిగా ఇస్తూ వస్తున్నాడు. ఇటీవల ఓ యాడ్‌లో మెరిసిన బాలయ్య, ఇప్పుడు మరోసారి ఆహాలో కనిపించి అభిమానులకు కావాల్సినంత కిక్ ఇవ్వనున్నాడు. ఆహాలో గతంలో వచ్చిన తెలుగు ఇండియన్ ఐడల్ తొలి సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌లో సందడి చేసిన బాలయ్య, ఆ షోకే హైప్ తీసుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. థమన్, కార్తీక్, గీతామాధురి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో స్పెషల్ ఎపిసోడ్‌లో బాలయ్య మరోసారి సందడి చేయనున్నాడు.

Balakrishna : బాలకృష్ణ కొత్త యాడ్ చూశారా? బంగారం, వజ్రాలతో మెరిపించిన బాలయ్య..

గాలా విత్ బాలా అనే కాన్సెప్ట్‌తో రాబోయే ఈ ఎపిసోడ్‌లో బాలయ్య అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెరవనున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వాటిలో బాలయ్యను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో కాస్ట్యూమ్ అచ్చం మైఖేల్ జాక్సన్‌లా ఉందంటూ వారు మురిసిపోతున్నారు. ఓ సూపర్ హిట్ సాంగ్‌కు బాలయ్య అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో బాలయ్య చేసే రచ్చ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.