Nani : నా దృష్టిలో పాన్ ఇండియా సినిమాలు అంటే..
తాజాగా నాని, నజ్రియా నటించిన అంటే సుందరానికి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నాని పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ..............

Nani
Nani : ఇటీవలి కాలంలో అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. స్టార్ హీరోల నుంచి సాధారణ హీరోలవరకు అంతా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్నాం అంటున్నారు. ఒక సినిమాని పలు భాషల్లో డబ్బింగ్ చెప్పించి దేశం మొత్తం రిలీజ్ చేసి దానిని పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఇక దేశంలో అన్ని చోట్ల మంచి విజయం సాధిస్తే అది పాన్ ఇండియా సినిమా అని ప్రేక్షకులే అంటున్నారు. ఇటీవల హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమా అంటూ పరుగులు తీస్తున్నారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా సినిమాకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు.
KL Rahul : బాలీవుడ్ హీరోయిన్ తో స్టార్ క్రికెటర్ పెళ్లి.. త్వరలో..
తాజాగా నాని, నజ్రియా నటించిన అంటే సుందరానికి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నాని పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ.. ”పాన్ ఇండియా మూవీ అంటే ఏంటో నాకు తెలీదు. మన సినిమాకి దేశమంతా మంచి పేరు వస్తే, ఎక్కడెక్కడ ఉన్న వాళ్లంతా మన తెలుగు సినిమా చూసి బాగుందని చెబితే అది పాన్ ఇండియా సినిమా కిందే లెక్క. నా తర్వాతి సినిమా ‘దసరా’ తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కానీ అది పాన్ ఇండియా సినిమా కాదు. ఇండియాలోని ప్రతి ప్లేస్ లో మన సినిమా రిలీజ్ అయితేనే అది పాన్ ఇండియా సినిమా అని నా ఫీలింగ్. అన్ని సినిమాలకు పాన్ ఇండియా సినిమా అనే ట్యాగ్ తగిలించడం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా తెలుగు సినిమా బాగుందని తెలుసుకొని దానికోసం వెతికి మరీ ఆ సినిమాలని చూస్తే వాటినే నిజమైన పాన్ ఇండియా సినిమాలు అని అంటారు” అని తెలిపారు.