Navjot Sidhu: సంవత్సరం జైలు శిక్ష విధించిన సుప్రీం, స్వతహాగా లొంగిపోయిన సిద్ధూ

కాంగ్రెస్ లీడర్ నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పంజాబ్ లోని పట్యాలా కోర్టులో లొంగిపోయారు. 34ఏళ్ల క్రితం రోడ్ రేజ్ ఇన్సిడెంట్ లో ఓ వ్యక్తి మృతికి కారణం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. అయితే తనకు మరికొద్ది వారాలు కావాలంటూ ఆ తర్వాత లొంగిపోతానని రిక్వెస్ట్ చేసుకున్నా ఫలించలేదు.

Navjot Sidhu: సంవత్సరం జైలు శిక్ష విధించిన సుప్రీం, స్వతహాగా లొంగిపోయిన సిద్ధూ

Sidhu

 

Navjot Sidhu: కాంగ్రెస్ లీడర్ నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పంజాబ్ లోని పట్యాలా కోర్టులో లొంగిపోయారు. 34ఏళ్ల క్రితం రోడ్ రేజ్ ఇన్సిడెంట్ లో ఓ వ్యక్తి మృతికి కారణం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. అయితే తనకు మరికొద్ది వారాలు కావాలంటూ ఆ తర్వాత లొంగిపోతానని రిక్వెస్ట్ చేసుకున్నా ఫలించలేదు.

సుప్రీంకోర్టులో నవజ్యోత్ సిద్ధూ తరపున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను సంప్రదించాలని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించలేమని సిద్ధూ బృందం పేర్కొంది. ‘చట్టానికి తలొగ్గుతాను’ అని ఆదేశాల అనంతరం సిద్ధూ ట్వీట్ చేశారు.

రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు సిద్ధూ. క్రికెటర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన.. అతనికి సుప్రీంకోర్టు గురువారం సంవత్సరం పాటు”కఠినమైన జైలు శిక్ష” విధించింది.

Read Also: కాంగ్రెస్ నేత సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

1988లో సిద్ధూ, అతని స్నేహితుడు కలిసి ఘర్షణ పడటం వల్లే తమ కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించాడని బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. డిసెంబర్ 27, 1988న, మిస్టర్ సిద్ధూ పాటియాలా నివాసి గుర్నామ్ సింగ్‌తో పార్కింగ్ స్థలం విషయంలో వాగ్వాదానికి దిగారు. సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్ సంధు, గుర్నామ్ సింగ్‌ను కారు నుండి బయటకు లాగి దాడి చేశారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్నామ్ మృతి చెందాడు.